KYC Scam: బ్యాంకు ఖాతాదారులకు మరోసారి ఆర్‌బీఐ హెచ్చరించింది. సైబర్ మోసాల నేపథ్యంలో ఈ అప్టేట్ ఇచ్చింది. KYC రెన్యూవల్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరించింది. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ఆర్‌బిఐ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజుల్లో అనేక సైబర్ క్రైమ్ కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. కేవైసీ అప్‌డేట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ మరోసారి బ్యాంకు ఖాతాదారులను హెచ్చరించింది. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని ఆర్‌బిఐ తెలిపింది. దీంతో పాటు ఆర్బీఐ కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చింది. సందేశాల ద్వారా పంపబడిన లింక్‌లను ఉపయోగించి KYC అప్‌డేట్ కోసం అనధికార/ధృవీకరించబడని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయమని మోసగాళ్లు కస్టమర్‌లను అడుగుతారు. మోసగాళ్లు ఖాతాను బ్లాక్ అవుతుంది అని బెదిరించవచ్చు. కస్టమర్‌లు అలాంటి సమాచారాన్ని షేర్ చేస్తే మోసగాళ్లు మీ ఖాతాను హ్యాక్ చేస్తారని RBI తెలిపింది. 


2021లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ KYC మోసం కేసులు పెరగడంతో RBI నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో RBI KYC ప్రక్రియను సులభతరం చేసింది. KYC ఫ్రాడ్ కేసుల్లో మోసగాళ్లు సాధారణంగా కస్టమర్‌లతో వ్యక్తిగత వివరాలు, ఖాతా,లాగిన్ సమాచారం, కార్డ్ వివరాలు, పిన్ లేదా ఓటీపీ పంచుకోవడానికి కాల్‌లు, టెక్స్ట్‌లు లేదా ఇమెయిల్‌లను ఉపయోగిస్తారని RBI తెలిపింది. దీంతో ఇప్పుడు మరో హెచ్చిరిక చేసింది ఆర్బీఐ ఇలా వార్నింగ్ ఇవ్వడం ఇది 2వ సారి .
 


1. ఫోన్, ఇమెయిల్ లేదా SMS ద్వారా KYC అప్‌డేట్ కోసం వ్యక్తిగత సమాచారాన్ని అడగడానికి బ్యాంక్ ఎప్పటికీ నేరుగా సంప్రదించదు. 
2. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని నేరుగా మీ బ్యాంకుకు నివేదించండి.
3. KYC అప్‌డేట్ కోసం ఏ లింక్‌ను క్లిక్ చేయవద్దు లేదా ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు.
4. మీ పిన్, OTP, UPI పిన్ లేదా ఇతర సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.



ఫిర్యాదు చేయడం ఎలా?
1. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి.
2. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్  www.cybercrime.gov.in ని సందర్శించండి .


ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు


ఇదీ చదవండి: Investment strategies for girl child: రూ. 4 వేలు పెట్టుబడి పెడితే రూ. 22 లక్షలు! మీ అమ్మాయి కోసం ఈ ప్రత్యేక పథకం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook