RBI Monetary Policy 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకు ఆమోదం తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో రెపో రేటును మళ్లీ పెంచకూడదని కమిటీ నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రెపో రేటు 6.50 శాతం అలాగే కొనసాగనుంది. గురువారం జరిగిన ఎంపీసీ సమావేశం తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా పాలసీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును క్రమంగా పెంచిన విషయం తెలిసిందే. శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


గతేడాది మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ వచ్చింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచడం తప్పలేదని వెల్లడించింది. ఫిబ్రవరి 2023 వరకు వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచింది. దీంతో 6.50 శాతానికి పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటుంది ద్రవ్య విధాన కమిటీ.  కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రేట్లు పెంచింది.  


మే నెలలో రెపో రేటును పెంచిన సమయంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతంగా ఉండేది. వడ్డీ రేట్లు పెంపు తరువాత క్రమంగా తగ్గింది. గతేడాది ఆగస్టు వరకు రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది. ఆ తర్వాత డిసెంబర్ నాటికి 5.7 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు 4.7 శాతానికి చేరింది. ఇది 18 నెలల కనిష్ట స్థాయి. రిటైల్ ద్రవ్యోల్బణం కొంతమేర అదుపులోకి రావడంతో ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది.


రెపో రేటును బట్టి బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. రిజర్వ్ బ్యాంక్‌ నుంచి అన్ని బ్యాంకులు తీసుకునే రుణం రేటునే రెపో రేటు అంటారు. ఈ రేటు పెరిగితే బ్యాంకుల మూలధనం వ్యయం పెరుగుతుంది. రెపో రేటు ఆర్‌బీఐ పెంచితే.. కస్టమర్లపైకి బ్యాంకులు మళ్లిస్తాయి. రెపో రేటు ప్రకారం బ్యాంకులు లోన్లు రేటు, డిపాజిట్ రేటును నిర్ణయిస్తాయి. రెపో రేటును తగ్గిస్తే.. బ్యాంకులు కూడా లోన్ల రేటును తగ్గిస్తాయి. 


Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!


 Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో గిఫ్ట్.. డీఏ పెంపు ఎంతంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి