RBI Request On Paytm: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పేటీఎం సంస్థకు భారీ ఊరట లభించింది. లావాదేవీల విషయంలో కొన్ని ఆంక్షలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) సడలించింది. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలపై కీలక ప్రకటన చేసింది. పేటీఎం యాప్‌ యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఆర్బీఐ సూచించింది. ఒక్కమాటలో చెప్పాలంటే పేటీఎంతో యూపీఐ వినియోగదారులు తమ లావాదేవీలు కొనసాగించేందుకు సహకరించాలని ఆర్బీఐ కోరింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్‌.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్‌ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే


పేటీఎం యాప్‌లో వినియోగదారులు యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా ఎన్‌పీసీఐ థర్ట్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ) హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆర్బీఐ తెలిపింది. పేటీఎం బ్రాండ్‌ కలిగి ఉన్న వన్‌97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (ఓసీఎల్‌) ఈ అభ్యర్థన చేసినట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఆర్బీఐ చేసిన విజ్ఞప్తితో పేటీఎం వినియోగదారులు తమ లావాదేవీలు చేసుకోవచ్చనే ఆశల్లో ఉన్నారు. అయితే ఆర్బీఐ చేసిన విజ్ఞప్తికి ఇంకా ఎన్‌పీసీఐ ఇంకా స్పందించలేదు. పీటీఎం విషయంలో ఆ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. ఎన్‌పీసీఐ ఆర్బీఐ చేసిన సూచనకు అంగీకరిస్తే ఇక పేటీఎం వినియోగదారులు యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. 

Also Read: PPF Deadline: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఎక్కౌంట్లు క్లోజ్


పీటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఆర్బీఐ తీవ్ర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీలు స్వీకరించవద్దని ఆదేశించింది. మొదట ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత వినియోగదారుల నుంచి ఎలాంటి నిధులు స్వీకరించవద్దని, డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్‌ లావాదేవీలను నిర్వహించవద్దని ఆదేశించింది. ఈ విషయంలో ఇటీవల మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన సూచనతో పేటీఎమ్‌కు కొంత చిక్కులు వీడినట్లు తెలుస్తోంది. మరి ఎన్‌పీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి