RBI on Monday superseded the board of Anil Ambani promoted Reliance Capital: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. రిలయన్స్ క్యాపిటల్​ లిమిటెడ్ (Reliance Capital) బోర్డును రద్దు చేసినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్​సీఎల్​కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ప్రమోటర్​గా వ్యవహరిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుణ దాతలకు చెల్లించాల్సిన పేమెంట్స్​ను గడువులోపు పూర్తి చేయడంలో విఫలమైన కారణంగా బోర్డును రద్దు చేసినట్లు ఆర్​బీఐ సోమవారం ప్రకటించింది.


బోర్డును రద్దు చేసిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ నాగేశ్వర్​ రావును (Nageswar Rao) ఆర్​సీఎల్​ కార్యనిర్వాహణ అధిపతిగా.. నియమించింది ఆర్​బీఐ.


త్వరలోనే.. దివాలా స్మృతి కింద సంస్థ దివాలా ప్రక్రియను (Reliance Capital insolvency) ప్రారంబిస్తామని ఆర్​బీఐ వివరించింది. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​టీ)ని కూడా సంప్రదిస్తుందని ఆర్​బీఐ పేర్కొంది.


రుణ ఏగవేతల విషయంలో ఇటీవల ఆర్​బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2019 నవంబర్​లో డీహెచ్​ఎఫ్​ఎల్ బోర్డును రద్దు చేసింది. ఈ ఏడాది అక్టోబర్​లో ఎస్​ఆర్​ఈఐ బోర్డను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా రిలయన్స్ క్యాపిల్​ బోర్డును సస్పెండ్ చేసింది.


ఓ నివేదిక ప్రకారం.. రిలయన్స్ క్యాపిటల్​ రూ.8,313 కోట్లను ఎగవేసింది. గత ఏడాది ఈ కంపెనీ 14,827 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్‌సిడి) లిస్ట్ చేసినట్లు వెల్లడైంది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్‌లు కనీసం 2028 వరకు నడవనున్నాయి.


2021 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం ఆస్తుల విలువ రూ.65,878 కోట్లుగా ఉన్నట్లు.. 2021కి సంబంధించి కంపెనీ ప్రకటించిన వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.


రిలయన్స్ క్యాపిటల్ రుణాల చెల్లింపులో ఇప్పటేక పలు మార్లు విఫలమైంది. దీనితో బ్యాంకుల్లో ఈ రుణాలను ఎన్​పీఏలుగా పరిగణించారు కూడా.


Also read: EPFO: గుడ్​ న్యూస్​- 21.38 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన ఈపీఎఫ్​ఓ!


Also read: Moto G31: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదిరాయిగా! 36 గంటలపాటు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook