Best Recharge Plans With 365 Days Validity: మన దేశంలో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్, జియో, Vi మూడు ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి. ఈ మూడింటింలోనూ ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. వన్ టైమ్ రీఛార్జ్ కోసం చూస్తున్న వినియోగదారులకే మాత్రమే కాకుండా.. డబ్బు ఆదా చేయాలనే వారికి కూడా ఈ ప్లాన్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏ టెలికాం కంపెనీ ఎంత రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి..? ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో ఓ సారి లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ ఇలా..


రూ. 1,799 ప్లాన్‌తో 365 రోజులపాటు చెల్లుబాటుతో ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్‌లు, ఏడాదికి 24 జీబీ డేటా కోటాను అందిస్తోంది ఎయిర్‌టెల్. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. అదనంగా చందాదారులు ఒక సంవత్సరం పాటు ఉచిత హలో ట్యూన్‌లు, కాంప్లిమెంటరీ Wynk మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందొచ్చు. అదనంగా ఇవే ప్రయోజనాలతో డేటా అదనంగా కావాలనుకునే వినియోగదారులు రూ.2,999 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైలీ 2 జీబీ డేటా ఏడాదిపాటు వినియోగించుకోవచ్చు. 


జియో వార్షిక ప్లాన్ ఇలా..


365 రోజుల వ్యాలిడిటీతో జియో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ వార్షిక ప్లాన్ ధర 2,879 రూపాయలలో తీసుకువచ్చింది. ఇది అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజువారీ 2 జీబీ డేటా పరిమితిని అందిస్తుంది. చందాదారులు JioCinema, JioTV వంటి సేవలకు కూడా యాక్సెస్ పొందుతారు. అంతేకాకుండా 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత 5G డేటాను వినియోగించుకోవచ్చు. కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టేవారికి జియో రూ.2,999 వార్షిక ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది రోజువారీ 4G డేటా పరిమితి 2.5 GB అందిస్తుంది. జియో నుంచి మరో ఆకర్షణీయమైన ఆఫర్ రూ.2,545 కూడా అందుబాటులో ఉంది. ఇది 336 రోజుల చెల్లుబాటు ఉంటుంది. రోజువారీ 1.5 జీబీ డేటా వినియోగించుకోవచ్చు.


Vi వార్షిక ప్లాన్ ఇలా..


Vi (వోడాఫోన్ ఐడియా) ఎయిర్‌టెల్ మాదిరే రూ.1,799 ప్లాన్‌ను తీసుకువచ్చింది. వినియోగదారులు ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 24 జీబీ 4G డేటాను పొందొచ్చు. రూ.2,899 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ 4G డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్, Vi సినిమాలు, టీవీ యాప్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ రెండింటికీ అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్ ఉంటుంది.


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook