Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, బిలియనీర్ ముకేష్‌ అంబానీ వరుసగా రెండో ఏడాది తన వేతనాన్ని ఉపసంహరించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో స్వచ్ఛందంగా పారితోషికాన్ని వదులుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ జీతం శూన్యం అని రిలయన్స్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 2020 కరోనా కల్లోలం సృష్టించింది. దీంతో అదే ఏడాది జూన్‌లో తన సంస్థ నుంచి వేతాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021-22లో కూడా ఆయన తన వేతనాన్ని వదులుకున్నారు. రెండు ఏళ్లల్లో ఛైర్మన్‌గా..మేనేజింగ్ డైరెక్టర్‌గా తన డ్యూటీ కోసం ఎలాంటి వేతనం తీసుకోలేదు. అలవెన్సులు, బెనిఫిట్స్, కమిషన్‌లు సైతం పొందలేదని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముకేష్‌ అంబానీ భారీగా వేతనం తీసుకునే వారు. 2009-09 నుంచి రూ.15 కోట్ల జీతం పొందేవారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ ఆయన రూ.15 కోట్ల వేతం తీసుకున్నారు. 


2008-09 నుంచి వేతనం, ఇతర అలవెన్సుల కోసం రూ.15 కోట్లు తీసుకునేవారని వార్షిక నివేదికలో రిలయన్స్ పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తితో అనేక రంగాలు కుదేలయ్యాయి. సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో రిలయన్స్ సంస్థలో ఛైర్మన్‌ తన జీతాన్ని వదులుకున్నారు. ఆయన దాయాదులు నిఖిల్, హితల్ మెస్వానీల రెమ్యునరేషన్ రూ.24 కోట్లుగా ఉంది. ఇందులో రూ.17.28 కోట్లు కమిషన్ల రూపంలో అందుతుందని తెలిపింది. కరోనా కారణంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ వేతనాలు స్వల్పంగా తగ్గాయి. 2020-21లో రూ.11.99 కోట్లుగా ఉన్న వేతనం 2021-22లో రూ.11.89 కోట్లగా ఉంది. కపిల్ రూ.4.22 కోట్లు పొందగా..ఈసారి రూ.4.24 కోట్లు తీసుకుంటున్నారు. 


కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న అంబానీ భార్య నీతా సిట్టింగ్ ఫీజు రూ.5 లక్షలుగా ఉంది. సంవత్సరానికి మరో రూ.2 కోట్ల రూపంలో కమిషన్‌ అందుతుంది. గతేడాది ఆమెకు రూ.8 లక్షల సిట్టింగ్ ఫీజు, రూ.1.65 కోట్లు అదనంగా కమిషన్‌ లభించింది. రిలయన్స్ సంస్థలో అంబానీ, ఆర్‌ఐఎల్ బోర్డు, మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు డైరెక్టర్లుగా ఉన్నారు. నీతా అంబానీతోపాటు దీపక్ సిజైన్, రఘునాథ్, ఆదిల్ జైనుల్ భాయ్, గుజ్రాల్, షుమీత్ బెనర్జీ, అరుంధతీ భట్టాచార్య, సీవీసీ కేవీ చౌదరి నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. స్వతంత్ర డైరెక్టర్లందరికీ రూ.5 కోట్ల కమిషన్‌ లభించనుంది. సౌదీ అరేబియా సార్వభౌమ సంపద నిధి అయిన పీఐఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్, బోర్డు మెంబర్ యాసిర్ ఓ అల్-రుమయాన్‌కు రూ.1.40 కోట్లు అదనంగా లభిస్తుంది. 


Also read:Rajinikanth: ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజనీకాంత్.. ఇక రచ్చ రచ్చే!


Also read:Viral Video: గాలిలోనే హెలికాప్టర్ నుంచి పులప్స్..గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook