Jio AirFiber Offers: జియో 3599 మొబైల్ వార్షిక ప్లాన్ పూర్తిగా ఉచితం 15 ఓటీటీలు కూడా 50 రూపాయలకే ఇలా బుక్ చేసుకోండి
Jio AirFiber Offers: దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సత్తా చాటుతోంది. ఇప్పుడు ఎయిర్‌ఫైబర్ సేవల్ని విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఆకర్షణీయమైన ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio AirFiber Offers: రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీడమ్ ఆఫర్ మరి కొద్దిరోజులు అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ ఆఫర్‌ను పొడిగించింది. ఈ ప్లాన్ ప్రకారం జియో కస్టమర్లకు గ్రేట్ డీల్ లభించనుంది. ఏకంగా ఏడాది పాటు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా అందుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా...ఆ వివరాలు మీ కోసం.
ఇది రిలయన్స్ జియో అందిస్తున్న ఫ్రీడమ్ ఆఫర్. కేవలం 50 రూపాయలతో ఈ ఆఫర్ బుక్ చేసుకోవచ్చు. ఇదొక ఎయిర్‌ఫైబర్ ప్లాన్. ఎయిర్‌ఫైబర్ ప్లాన్ తీసుకునే ఆలోచన ఉంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడీ ఆఫర్ తీసుకుంటే జియో మొబైల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా ఉచితంగా లభించనుంది. ఎయిర్ ఫైబర్ ప్లాన్ తీసుకుంటే 3599 రూపాయల వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్ పూర్తిగా ఉచితంగా లభించనుంది. ఈ ప్లాన్ 365 రోజులు వర్తిస్తుంది. ఈ వార్షిక ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, అన్‌లిమిటెడ్ 5జి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా జియో టీవీ, జియో సినిమా ఉచితంగా లభిస్తాయి.
మీరు చేయాల్సిందల్లా జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ కేవలం 50 రూపాయలకే బుక్ చేసుకుంటే చాలు. ఆ 50 రూపాయలు కూడా రిఫండ్ వచ్చేస్తాయి. ఈ ఎయిర్ ఫైబర్ ప్లాన్ టారిఫ్ కేవలం 2121 రూపాయలు మాత్రమే. 30 శాతం డిస్కౌంట్ తరువాత ఈ ధరకు లభిస్తోంది. ఈ ప్లాన్ 3 నెలలు ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్‌ఫైబర్ ఇన్‌స్టాలేషన్ 1000 రూపాయల విలువైంది ఉచితంగా అందుతుంది. అంటే కేవలం 2121 రూపాయలతో 3 నెలల ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే 3599 రూపాయల విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లో 800కు పైగా డిజిటల్ టీవీ ఛానెల్స్ ఉచితంగా లభిస్తాయి. 15కు పైగా ఓటీటీ ఛానెల్స్ ఉచితంగా అందుతాయి. 1 జీబీపీఎస్ వైఫై ఉంటుంది. దేశంలోని 14 ప్రాంతీయ భాషల్లో కలిపి 800 ఛానెల్స్ ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా లభించే ఓటీటీ యాప్స్‌లో నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, సోనీ లివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటివి ఉన్నాయి.
Also read: Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే, పాత బైక్స్ మైలేజ్ ఎలా పెంచుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook