Jio Brings 3 New Recharge Plans Ahead of IPL 2023: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య లీగ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు టెలికం దిగ్గజాలు కూడా తమ కస్టమర్లకు పలు కొత్త ప్లాన్‌లను అందిస్తున్నాయి. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 కోసం తమ యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఐపీఎల్ వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న వారికి ఈ జియో ప్లాన్‌ బాగుంటుంది. ఎందుకంటే డేటా వేగం తగ్గదు, ఏమాత్రం కూడా అయిపోదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో తన క్రికెట్ కస్టమర్ల కోసం ఏకంగా మూడు ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ. 999, రూ. 399, రూ. 219 లతో మూడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను (IPL 2023 Jio Prepaid Plans) అందుబాటులోకి తెచ్చింది. రూ. 999 ప్లాన్ ద్వారా రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMSలు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌పై రూ. 241 ఉచిత ఓచర్ లభిస్తుంది. 84 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటకు 252 GB డేటాను అందిస్తుంది. అదనంగా 40GB డేటా వరకు పొందవచ్చు. జియో యూజర్లు JioCinema, JioSecurity, JioCloud, JioTV, Jio యాప్‌ల సూట్‌కు యాక్సెస్ పొందవచ్చు.


రూ. 399 రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే.. రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMSలు పొందవచ్చు. రూ. 61 విలువైన ఉచిత వోచర్ కూడా వస్తుంది. అంతేకాదు 6GB డేటాను అదనంగా పొందవచ్చు. రూ. 399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల తరువాత ప్యాక్ గడువు ముగుస్తుంది. ఇక రూ. 229 ప్యాక్ 14 రోజుల వరకు గడువు ఉంటుంది. రోజుకు 3GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMSలు పొందవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 2GB డేటాను అదనంగా పొందవచ్చు. 


రిలయన్స్ జియో అందించే ఈ క్రికెట్ ప్లాన్‌లు మల్టీ కెమెరా యాంగిల్స్‌తో (4K) రిజల్యూషన్‌లో లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు స్సెషల్ యాక్సెస్‌ను అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ జియో ట్రూ 5G (Jio True 5G) డేటాకు సపోర్టు చేస్తాయి. దాంతో మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. మొత్తానికి ఈ మూడు ప్లాన్‌లతో హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఐపీఎల్ 2023ని ఆస్వాదించొచ్చు. 


Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. రోహిత్ శర్మ ఔట్! కెప్టెన్‌గా సూర్యకుమార్   


Also Read: Best Mileage Car 2023: స్విఫ్ట్ కంటే తక్కువ ధర.. ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్! 27 కిలోమీటర్ల మైలేజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.