Reliance Jio New Plans: రిలయన్స్ జియో ఇండియాలో అతిపెద్ద టెలీకం కంపెనీగా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఇతర కంపెనీలకు పోటీగా ఆకర్షణీయమైన ప్లాన్స్ ఎప్పటికప్పుడు అందిస్తోంది. జూలై 3 అంటే రేపట్నించి రిలయన్స్ జియో సరికొత్త అన్‌లిమిటెడ్ 5జి ప్లాన్స్ లాంచ్ చేయనున్నామని ప్రకటించింది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.  జూలై 3 నుంచి కొత్త ప్లాన్స్ ప్రారంభం కానున్నాయి. కొత్త టారిఫ్ ప్లాన్‌లో నెలకు 189 రూపాయల్నించి  ఏడాదికి 3,599 రూపాయల వరకూ ఉన్నాయి. 2జీబీ డేటా నుంచి 2.5 జీబీ డేటా వరకూ ఉంటుంది. ఈ ప్లాన్లలో రోజుకు 2జీబీ డేటా అంతకంటే ఎక్కువ అయితే అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. ట్రూ 5జి నెట్‌వర్క్ అయితే చాలా వేగంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అన్‌లిమిటెడ్ 5జి మాత్రం రోజుకు 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్స్‌కే వర్తిస్తుంది. 


హై క్వాలిటీ చౌకైన ఇంటర్నెట్ సౌకర్యం ప్రతి ప్రాంతానికి విస్తరింపచేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. కస్టమర్లను సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించింది. 


అంతేకాకుండా త్వరలో జియో సేఫ్, జియో ట్రాన్సలేట్ పేర్లతో రెండు యాప్స్ లాంచ్ చేయనుంది. జియో 199 రూపాయలతో జియో సేఫ్ కాలింగ్, మెస్సేజింగ్‌కు మంచి ప్లాన్‌గా ఉంది. నెలకు 99 రూపాయల జియో ట్రాన్స్‌లేట్ ప్లాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. వాయిస్ కాలింగ్, మెస్సేజ్, టెక్స్ట్ మెస్సేజ్, ఇమేజ్ ట్రాన్స్‌లేట్ ద్వారా మల్టీ లింగ్యువల్ కమ్యూనికేషన్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. 


Also read: FD Interest Rates: ఒక ఏడాది ఎఫ్‌డీపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook