Jio Recharge Plans: రిలయన్స్ జియో అందిస్తున్న వివిధ రీఛార్జ్ ప్లాన్స్‌లో ముఖ్యమైంది 749 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అదనపు డేటాతో పాటు అధిక లాభాలు కూడా అందిస్తుంది. అందుకే ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియోలో చాలా రకాల ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. 24 రోజుల్నించి 28 రోజులు 30 రోజులు, 56 రోజులు 84 రోజులు, 90 రోజులు, 365 రోజులు ఇలా వివిధ రకాల వ్యాలిడిటీతో ప్లాన్స్ ఉన్నాయి. అలాంటి ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో ఒకటి 749 రూపాయలు ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అద్భుతమైన లాభాలు అందించే ప్లాన్‌గా ఆదరణ పొందింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులకు ఉంటుంది. అంటే మొత్తం 3 నెలలు పనిచేస్తుంది. దీంతోపాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సౌకర్యం ఉంటుంది. జియో 749 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 రోజుల వ్యాలిడిటీ సమయంలో మొత్తం 180 జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా మధ్యలో అదనంగా 20 జీబీ డేటా లభిస్తుంది. 


జియో 749 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందవచ్చు. డేటా కాస్త అధికంగా వినియోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 666 రూపాయల మరో ప్రీ పెయిడ్ ప్లాన్ 84 రోజుల కాల వ్యవధితో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తుంది. అందుకే డేటా అధికంగా అవసరమైతే జియో 749 రూపాయల ప్లాన్ బెస్ట్ అని చెప్పచ్చు. రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే మరో ప్లాన్ 1198 రూపాయలకు ఉంది. ఈ ప్లాన్ కాల పరిమితి 84 రోజులే. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. ఇక అదనంగా 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. 


Also read: Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఎప్పట్నించంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook