Reliance Jio Recruitment: కరోనా మహమ్మారి తరువాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. కరోనా ప్రభావం తగ్గిపోయినా.. ఆయా కంపెనీల్లో లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ రాబోతుంది. మన దేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు వర్క్‌ ఫోన్స్‌ను 25 శాతం పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 5G టెక్నాలజీ విస్తరణ కోసం కంపెనీలకు మరింత ఎక్కువ మంది వర్క్‌ఫోర్స్ అవసరం కానున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి. కోవిడ్ తరువాత టెలికాం రంగంలో కొత్త రిక్రూట్‌మెంట్‌లను భారీగా తగ్గించాయి. తాజాగా 25 శాతం మందిని నియమించుకునేందుకు రెడీ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జనవరి నుంచి టెలికాం రంగంలో నియామకాల వృద్ధి 40 నుంచి 45 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఇంగ్లీష్‌ పోర్టల్ మింట్ వెల్లడించింది. రానున్న 6 నెలల్లో దేశంలో పెరుగుతున్న 5G ప్రభావంతో కొత్త రిక్రూట్‌మెంట్ల వేగం 30 నుంచి 36 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ప్రధానంగా వైట్‌స్పేస్ స్పెక్ట్రమ్, 5G, వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేషన్స్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, బిగ్ డేటాలో IoT, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు, క్లౌడ్ వంటి అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్లలో నియామకాలు జరిగే అవకాశం ఉందని రిక్రూటర్లు అంచనా వేస్తున్నారు.


దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ల వేగంతో 5G సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది. "జియో కస్టమర్లు ఇప్పుడు మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో 26 GHz mmWave-ఆధారిత వ్యాపార-కనెక్టివిటీని ఉపయోగిస్తున్నారు" అని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఆగస్టు 17న తమకు కేటాయించిన స్పెక్ట్రమ్ నిబంధనల ప్రకారం.. ప్రతి స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలోని ప్రతి 22 టెలికాం సర్కిల్‌లలో దాని కనీస రోల్-అవుట్ బాధ్యతలను పూర్తి చేసినట్లు పేర్కొంది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ నియకాలు జరగనున్నాయి. 


మరోవైపు పెరుగుతున్న 5G సేవ కారణంగా భారతీ ఎయిర్‌టెల్ కంపెనీకి భారీ ఎత్తున రిక్రూట్‌ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ.. తన ప్రమోటర్ గ్రూప్ నుంచి రూ.2 వేల కోట్ల ఆర్థిక సహాయానికి హామీని పొందింది.  ఈ ఏడాది జూన్ నెల వరకు కంపెనీ మొత్తం అప్పు రూ.2.11 లక్షలకు చేరింది. అందులో రూ.2000 కోట్ల రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో వోడాఫోన్ ఐడియాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం చేస్తామని కంపెనీ ప్రమోటర్ గ్రూప్ భరోసా ఇచ్చింది.


Also Read: Minister KTR: 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధం.. వచ్చే వారంలోనే తొలి దశ పంపిణీ: మంత్రి కేటీఆర్  


Also Read: Warangal Road Accident: రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook