May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
May 2024 Bank Holidays: ఏప్రిల్ నెల ముగుస్తోంది. మరో రెండ్రోజుల్లో మే నెల ప్రారంభం కానుంది. ఎప్పటిలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మే నెలలో ఏరోజు బ్యాంకులకు సెలవుందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఉన్నాయి.
May 2024 Bank Holidays: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. చెల్లింపులు, లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయితే కొన్ని కీలకమైన పనుల కోసం మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు. మీక్కూడా బ్యాంకు పనులుంటే ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ఎందుకంటే మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి.
ఆర్బీఐ ఎప్పటిలానే మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలున్నాయి. అంటే ఆరు రోజులు సాధారణ సెలవులు మినహాయిస్తే మిగిలిన ఆరు రోజులు వివిధ ప్రాంతీయ, జాతీయ సెలవులున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఎప్పుడు బ్యాంకులు పనిచేస్తాయో తెలుసుకుంటే ఎలాంటి సమస్యా తలెత్తదు. ఆర్బీఐ జారీ చేసిన మే నెల బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి.
మే 1 కార్మిక దినోత్సవం, బ్యాంకులకు జాతీయ సెలవు
మే 5 ఆదివారం సెలవు
మే 8 బుధవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, పశ్చిమ బెంగాల్‌లో సెలవు
మే 11 రెండవ శనివారం సెలవు
మే 12 ఆదివారం సెలవు
మే 16 గురువారం సిక్కిం రాష్ట్ర దినోత్సవం సెలవు
మే 19 ఆదివారం
మే 20 సోమవారం, బేలాపూర్, ముంబైలో సార్వత్రిక ఎన్నికల సెలవు
మే 23 గురువారం బుద్ధపూర్ణిమ, అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగడ్,డెహ్రూడూన్, ఈటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, ఢిల్లీ,రాయ్‌పూర్, రాంచీ సిమ్లాలో సెలవు
మే 25 నాలుగో శనివారం సెలవు
మే 26 ఆదివారం సెలవు
Also read: Cinnamon Water: ఈ నీళ్లతో కలిగే లాభాలు వింటే ఇక జీవితాంతం వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook