Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్! ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. అయితే ఈ విషయాన్ని సదరు యాజమాన్యం అధికారికంగా చెప్పలేదు. కానీ, తమ మార్కెటింగ్ డీలర్లకు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2023 ఆగస్టు నాటికి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ యోచిస్తున్నట్లు సమాచారం. 2020 - 21 కంపెనీ వార్షిక నివేదికలో తమ మోటార్ బైక్స్ లో ఎలక్ట్రిక్ శ్రేణిని అభివృద్ధి చేస్తున్నట్లు ధ్రువీకరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్యావరణంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ బైక్స్ ను తయారు చేసే పనిలో పడింది. దానికి సంబంధించిన ప్రొటోటైప్ ను కూడా సిద్ధం చేసింది. అంతే కాకుండా త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ ప్రారంభించడం సహా వచ్చే ఏడాది భారత్ లోనూ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లో సరికొత్త ఫీచర్లకు అందుబాటులో ఉంటాయని బైక్ లవర్స్ భావిస్తున్నారు. 


భారత్ లో విడుదల ఎప్పుడు?


రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కంపెనీ తయారు చేయనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ను వచ్చే ఏడాది 2023లో భారత విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బైక్ లో 8 kWh నుంచి 10 kWh బ్యాటరీ సామర్థ్యం ఉండొచ్చని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బైక్‌ల పవర్, గరిష్ట టార్క్ దాదాపు 40bhp, 100Nm గా ఉండవచ్చని అంచనా.  


Also Read: Petrol Diesel Price Hike: మరోసారి భగ్గుమన్న ఇంధన ధరలు.. 12 రోజుల్లో రూ. 7.20 పెంపు!


Also Read: Whatsapp Ban Accounts: 14.26 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook