Samsung and Tesla Deal: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్..ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా మధ్య కీలక ఒప్పందమైంది. టెస్లా కంపెనీ ఉత్పత్తి చేయనున్న సైబర్ ట్రక్ వాహనాల కోసం ఈ కీలకమైన ఒప్పందం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా (Tesla) ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో సంచలనాన్ని సృష్టించింది.టెస్లా కొత్తగా సైబర్ ట్రక్ వాహనాల్ని ఉత్పత్తి చేయనుంది. ఇందులో భాగంగా శాంసంగ్ , టెస్లా కంపెనీల మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా సైబర్ ట్రక్ వాహనాల్లో కెమేరా మాడ్యూల్స్‌‌ను అమర్చే పని శాంసంగ్ చేపట్టనుంది. దాదాపు 436 మిలియన్ డాలర్ల ఒప్పందమిది. కెమేరా మాడ్యూళ్లను సరఫరా చేసేందుకు టెస్లాతో డీల్ కుదిరిందని శాంసంగ్ వెల్లడించింది. గతంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ సరఫరా చేసేందుకు శాంసంగ్‌తో (Samsung) ఒప్పందమైంది. శాంసంగ్ తయారు చేసిన పిక్సెల్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లను టెస్లా ఉత్పత్తి చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో వినియోగిస్తున్నారు.టెస్లా కొత్తగా తయారు చేస్తున్న సైబర్ ట్రక్ వాహనాలు మార్కెట్‌లో సంచలనం కానున్నాయని అంచనా ఉంది. 


Also read: Gold Price In Hyderabad 14th July 2021: మార్కెట్లో పసిడి ధరల జోరు, భారీగా పతనమైన వెండి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook