Samsung Pre-Book: రూ.1999కే శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 4 ప్రీ-బుకింగ్.. 5 వేల ప్రత్యేక ఆఫర్ మీ కోసమే!
Samsung Galaxy Z Fold 4 phone Pre-book for just Rs 1999. శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్‌లు ఆగష్టు 10న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Samsung Galaxy Z Fold 4 phone Pre-book for just Rs 1999: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం 'శాంసంగ్' తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్‌లు ఆగష్టు 10న మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. గతంలో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ తరహాలోనే వీటి డిజైన్ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్‌లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈరోజు నుంచి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్‌ల ప్రీ-బుకింగ్ జూలై 31 నుంచి అందుబాటులో ఉంటుంది. రూ.1999క చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆగష్టు 10న లాంచ్ కాగానే మీరు ఈ ఫోన్‌లను కోలుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రీ-బుకింగ్ తర్వాత ఫోల్డ్ 4 లేదా ఫ్లిప్ 4 కొనుగోలు చేసిన వారికి రూ. 5,000 విలువైన అదనపు ప్రయోజనాలను శామ్‌సంగ్ అందించనుంది. మీరు ఈ ఫోన్‌ను లాంచ్‌కు ముందే బుక్ చేసుకోవాలనుకుంటే.. శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫోల్డబుల్ ఫోన్‌ల పేజీపై 'రిజిస్టర్ నౌ' ఎంపిక చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫోన్ బుక్ చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్‌లు ఆగస్టు 10న సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆపై ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ల ధరలు దాదాపుగా రూ. 1.60 వేలుగా ఉండనున్నాయి. అయితే ఈ రెండు ఫోన్‌లలో ప్రత్యేక స్సెసిఫికేషన్లు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
శాంసంగ్ గ్యాలెక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్పెసిఫికేషన్లు:
# 7.6 అంగుళాల క్యూఎక్స్‌జీఏ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే
# 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
# 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్
# ఆండ్రాయిడ్ 12 వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టం
# 4400 ఎంఏహెచ్ బ్యాటరీ
# 25W ఫాస్ట్ చార్జింగ్
# బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ( 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్)
# 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
Also Read: Palnadu: పల్నాడు జిల్లాలో పరువు హత్య కలకలం..కొడుకును చంపిన తల్లిదండ్రులు..!
Also Read: Anagaraka Yoga: అంగారక యోగంతో ఈ 5 రాశుల వారికి పొంచి ఉన్న ముప్పు.. ఆగస్టు 10 వరకు జాగ్రత్తగా ఉండాలి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook