Samsung new launch: భారతీయ మార్కెట్‌లో Samsung Galaxy M14 5G లాంచ్ అయింది. యూరోపియన్ మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, బ్యాటరీ సామర్ధ్యం నిజంగానే అద్భుతం. పూర్తి వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంసంగ్ కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో ఇటీవలే లాంచ్ అయింది. Samsung Galaxy M14 5G ఇప్పుడు అమెజాన్‌లో ఏప్రిల్ 21 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌‌సెట్ గెలాక్సీ ఎం13 కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో ఫీచర్లు దాదాపుగా ఒకటే. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం14 ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.


Samsung Galay M14 5G ధర


ఇది ఫుల్ హెచ్‌డి ప్లస్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లేతో 6.6 ఇంచెస్ స్క్రీన్ కలిగిన స్మార్ట్‌ఫోన్. Samsung Galaxy M14 5Gలో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ ధర 13,490 రూపాయలుంది. అదే 6 జీబీ వేరియంట్, 128 జీబీ స్టోరేజ్ అయితే 14,490 రూపాయలుంది. ఈ ఫోన్ 3 రంగులు సిల్వర్, బెర్రీ బ్లూ, స్మోకీ టీల్ లో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 21 మద్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ వేదికగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.


Samsung Galaxy M14 5G కెమేరా, బ్యాటరీ


ఎఫ్ 1.8 లెన్స్‌లో లైట్ ఫోటోగ్రఫీని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. సెల్ఫీ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది.గెలాక్సీ ఎం 14 లో 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధమైన ఛార్జింగ్ లేకుండా రెండురోజులు నడుస్తుందట. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 


Samsung Galaxy M14 5G ఫీచర్లు


శాంసంగ్ గెలాక్సీ ఎం14 స్మార్ట్‌ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ కోసం 5ఎన్ఎం ఎక్సీనోస్ 1330 ప్రోసెసర్ ఉంది.  ఇందులో ఒక పవర్ ఎఫిషియెంట్ సీపీయూ స్ట్రక్చర్ ఉంది. గేమింగ్ కోసం అద్భుతంా పనిచేస్తుంది. 3 డి గ్రాఫిక్స్ సైతం అందిస్తుంది. గెలాక్సి ఎం 14 5జి ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో పాటు 12 జీబీ వరకూ ర్యామ్ ఉంటుంది.


వ్యక్తిగత డేటా, అప్లికేషన్ స్టోర్ చేయాలంటే ఈ డివైస్‌లో సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది ప్రత్యేకంగా. ఈ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.1 కోసం ఓఎస్ అప్‌గ్రేడ్ అయింది. 


Also read: Hyundai Creta Facelift Launch 2023: హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. బుకింగ్స్ మొదలు! ఫీచర్లు ఇవే<



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook