దక్షిణ కొరియా ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ మరో లేటెస్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. తాజా మోడల్‌ శాంసంగ్ డబ్ల్యూ21 5జీ (Samsung W21 5G)ని ప్రస్తుతం చైనా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్, అదేనండీ మడతపెట్టే రకం స్మార్ట్‌ఫోన్. దీని ప్రత్యేకతలు, సౌకర్యాలు దాదాపుగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 తరహాలోనే ఉన్నాయి. అయితే ఈ మోడల్ కేవలం ఒకే రంగులో అందుబాటులో ఉంది. 



 


శాంసంగ్ డబ్ల్యూ21 5జీ ఫీచర్లు  (Samsung W21 5G Specifications) 


  • 7.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫోల్డబుల్ డైనమిక్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-ఓ డిస్ ప్లే

  • మడిస్తే 6.2 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే అవుతుంది.

  • 3 రియర్ కెమెరాలు దీని సొంతం

  • 12 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది.

  • సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

  • బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్

  • 12 జీబీ RAM

  • 512 జీబీ వరకు డేటా స్టోరేజ్

  • బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్ సౌకర్యం

  • యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 

  • 25W ఫాస్ట్ చార్జింగ్, 11W వైర్ లెస్ చార్జింగ్, వైర్ లెస్ పవర్ షేర్ ఫీచర్ ఉంది


శాంసంగ్ డబ్ల్యూ21 5జీ ధర (Samsung W21 5G Price In India)  
అత్యంత ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ ధర చాలా అధికం. అందులోనూ కేవలం గోల్డ్ కలర్‌తో మాత్రమే లాంచ్ చేశారు. చైనాలో విడుదలైన ఈ మోడల్ Samsung W21 5G Price అక్కడ 19,999 యువాన్లు. అయితే భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2.2 లక్షల (Samsung W21 Price In India) వరకు ఉంటుంది. అత్యంత పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe