SBI FD Rates: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఫిక్స్​డ్​  డిపాజిట్ (ఎఫ్​డీ) వినియోగదారులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. భారీ మొత్తాల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 20-40 బేసిస్​ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయి తీసుకుంది. రూ.2 కోట్లు అంతకన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్లకు మాత్రం ఈ పెంపు వర్తిస్తుందని చెప్పింది ఎస్​బీఐ. మార్చి 10 నుంచే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది బ్యాంక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వడ్డీ రేట్లలో పెరుగుదల ఇలా..


  • 7-14 రోజుల మెచ్యూరిటీ పీరియడ్​ ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేటు 2.90 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇది 3.40 శాతంగా ఉంది.

  • 15-29 రోజుల పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 2.90 శాతం. సీనియర్ సిటిజన్లకు 3.40 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.

  • 30-45 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 2.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 3.40 శాతం.

  • 46-60 రోజుల పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్ సిటిజన్లకు 4.40 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.

  • 61-90 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 4.40 శాతం.

  • 91-120 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 4.40 శాతం.

  • 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు సాధారణ పౌరులకు 4.40 శాతం. సీనియర్ సిటినజ్లకు రూ.4.90 శాతం,

  • 9 నెలల 1 రోజు నుంచి ఏడాది లోపు ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం. సీనియర్ సిటినజ్లకు మాత్రం రూ.4.90 శాతం,

  • ఏడాది వ్యవధి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం,

  • ఏడాది ఒకరోజు నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం. సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం.

  • రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు సాధారణ పౌరులకైతే 5.20 శాతం, సీనియర్ సిటిజన్లకైతే 5.70 శాతం.

  • మూడేళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్​డీలకు 5.45 శాతం వడ్డీ  ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్ సిటిజన్లకు ఇది 5.95 శాతం.

  • 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లకు వడ్డీ రేటు 5.50 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 6.30 శాతంగా నిర్ణయించింది ఎస్​బీఐ.


Also read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు ఊహించని షాక్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఈపీఎఫ్ఓ!


Also read: Soundbar Days: అమెజాన్​లో మళ్లీ సౌండ్​బార్​ డేస్ సేల్​.. 55 శాతం వరకు డిస్కౌంట్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook