SBI Home Loan: సొంతింటి కల సాకారం చేసుకోవాలనుందా, ఖాతాదారులకు ఎస్బీఐ శుభవార్త
SBI Home Loan Interest Rates Reduced | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు సైతం 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.
SBI Reduces Home Loan Interest Rates: ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు ఇప్పుడు సిబిల్ స్కోరుతో అనుసంధనమై ఉన్నాయి. 6.70 శాతం నుంచి గృహ రుణాలు అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ కస్టమర్లు 5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ పొందడానికి యోనో యాప్(YONO app) సహాయంతో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు శుభవార్త. తన ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. మంచి సిబిల్ స్కోరు ఉన్నవారికి 6.70 శాతం నుండి వడ్డీ రేట్లతో 70 బేసిస్ పాయింట్ల (Basic Points) వరకు రాయితీని ఎస్‌బీఐ అందిస్తోంది. అయితే పరిమిత కాలపరిమితితో అందుబాటులోకి తెచ్చిన ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. గృహ రుణాలపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు సైతం 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
‘వినియోగదారులకు చేయూత అందించడం, వారి సొంతింటి కలను సాకారం చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటి రుణాల వడ్డీరేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. EMI సైతం తగ్గుతుందని’ ఒక ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు
సిబిల్ స్కోరు ఆధారంగా ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీ రేట్లు(SBI Home Loan Interest Rates) అనుసంధానమై ఉన్నాయి. CIBIL స్కోరు ఆధారంగా రూ .30 లక్షల వరకు రుణాలకు 6.70 శాతం వడ్డీ రేట్లు, రూ.30 లక్షలకు మించి తీసుకునే రుణాలకు 6.95 శాతం వడ్డీ వసూలు చేయనుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ మహిళా కస్టమర్లు 5 బేసిక్ పాయింట్లు రాయితీ అందిస్తోంది ఎస్‌బీఐ. ఇంటి రుణాలపై ఇది ఆకర్షణీయమైన వడ్డీ రేటు అని, ఈ ఆఫర్ మార్చి 31వ తేదీతో ముగియనుందని స్పష్టం చేసింది. నగదు మొత్తాన్ని సరైన పద్ధతిలో ఖాతాదారులు తిరిగి చెల్లిస్తారని విశ్విసిస్తున్నట్లు తన ప్రకటనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్, ఆర్మీ మరియు డిఫెన్స్ సిబ్బందికి ఎస్‌బీఐ శౌర్య హోమ్ లోన్, ఎస్‌బీఐ మాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్‌బీఐ స్మార్ట్ హోమ్, ఇదివరకే ఖాతాదారులు అయిన వారి కోసం టాప్-అప్ లోన్, ఎస్బిఐ ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఎస్‌బీఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్, ఎస్‌బీఐ హర్‌ఘర్ హోమ్ లోన్ వంటి కొన్ని రకాల రుణాలను ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ బ్యాంక్ అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook