SBI Campaign Rates Offer: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. కాంపెయిన్ రేట్స్‌ పేరుతో హోమ్ లోన్ వడ్డీ రేట్లపై 30 నుంచి 40 బీపీఎస్ రాయితీ ఇస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. కొత్త ఆఫర్ కింద కస్టమర్‌లకు సాధారణ గృహ రుణాలపై ఎస్‌బీఐ 8.60 శాతం తక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. అయితే క్రెడిట్ స్కోర్‌లను బట్టి హోమ్ లోన్ రేట్లు మారతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎస్‌బీఐ 8.90 శాతంతో హోమ్‌లోన్ అందిస్తోంది. మీ క్రెడిట్ స్కోర్  700 నుంచి 800 వరకు ఉంటే.. ఈ కొత్త ఆఫర్ కింద 8.60 శాతం వడ్డీ రేటుతో లభిస్తుంది. మీకు 30 నుంచి 40 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు పొందవచ్చు. 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే.. 8.90% సాధారణ వడ్డీ రేటు నుంచి 30 బీపీఎస్ రాయితీ పొందవచ్చు. 


ఎవరిదైనా క్రెడిట్ స్కోర్ 750 నుంచి 799 మధ్య ఉంటే.. వారికి గృహ రుణం 9 శాతం చొప్పున అందుబాటులో ఉంటుంది. కానీ ఇప్పుడు 40 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత వారికి 8.60 శాతం వద్ద అందుబాటులో ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే.. ఇప్పటివరకు గృహ రుణం 9.10 శాతం వద్ద అందుబాటులో ఉంది. తాజా ఆఫర్ కింద 8.70 శాతం అంటే 40 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో లభిస్తుంది. మహిళలు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపును పొందుతారు. జీతం ఖాతాదారులు ప్రివిలేజ్, అపోన్ ఘర్ పథకాలపై 5 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపును పొందుతారు. రక్షణ సిబ్బందికి శౌర్య, శౌర్య ఫ్లెక్సీ ఉత్పత్తుల కింద అందించే గృహ రుణ రేట్లపై 10 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపు లభిస్తుంది. 


టాప్ అప్ లోన్‌పై డిస్కౌంట్ ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌లు ఉన్నవారికి 9.30 శాతంతో టాప్ అప్ లోన్ అందజేస్తుండగా.. తాజా ఆఫర్ కింద 9 శాతానికి అందుబాటులో ఉంటుంది. అంటే 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 నుంచి 799 వరకు ఉన్నవారు 9.40 శాతం చొప్పున రుణాలు పొందుతుండగా.. ఇప్పుడు 9.10 శాతం రేటుతో అందుబాటులో ఉంటుంది. 


అదేవిధంగా కాంపెయిన్ రేట్స్‌ ఆఫర్ కింద హోమ్ లోన్, టాప్ అప్ లోన్‌ల ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐ పండుగ హోమ్ లోన్ ఆఫర్ జనవరి 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాంపెయిన్ రేట్స్‌ పేరుతో మరో ఆఫర్‌తో ఖాతాదారుల ముందుకు వచ్చింది.  


Also Read: Mla Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు.. ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫైర్   


Also Read: India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి