SBI Loan offers: ప్రభుత్వ రంగం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ మహిళలకు గుడ్​ న్యూస్​ చెప్పింపది. మహిళలకు తక్కువ వడ్డీ రుణాలతో పాటు అదనపు ప్రయోజనాలు ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రుణాలు క్రెడిట్ స్కోరుతో లింక్ అయ్యుంటాయి. అంటే దీనర్థం ఎంత రుణం లభిస్తుంది అనేది మీ క్రెడిట్​ స్కోరును బట్టి నిర్ణయిస్తుంది బ్యాంకు. క్రెడిట్​ స్కోరు 750 కన్నా ఎక్కువగా ఉంటే.. రుణాలు ఎక్కువగా లభిస్తుంటాయి. స్కోరు తక్కువగా ఉంటే.. లోన్​ కూడా తక్కువగానే వస్తుంది. మరి ఎస్​బీఐ రుణాలపై ఎలాంటి ఆఫర్లు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్​బీఐ తెలిపిన వివరాల ప్రకారం..


ఈ లోన్​లకు సంబంధించిన కొన్ని వివరాలను ఎస్​బీఐ ట్విట్టర్​లో వెల్లడించింది. మీ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఎస్​బీఐ హోం లోన్ పొందడి అంటూ ఆఫర్ వివరాలు చెప్పుకొచ్చింది. ఈ లోన్​ తీసుకునేందుకు 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు అర్హులని తెలిపింది. ఎస్​బీఐ ఇచ్చే లోన్​లలో ఫ్లెక్సీ పే, ఎన్​ఆర్​ఐ హోమ్​లోన్స్​, డిఫెన్షియల్ ఆఫర్​,శౌర్య , అప్నా ఘర్ వంటివి ఉన్నాయని పేర్కొంది.


ఎస్​బీఐ లోన్​కు అర్హతలు, నిబంధనలు..


లోన్​ తీసుకునే వ్యక్తి భారతీయుడై ఉండాలి


వయోపరిమితి 18 నుంచి 70 సంవత్సరాలు


రుణం తిరిగి చెల్లించేందుకు గరిష్ఠ పరిమితి 30 ఏళ్లు


ప్రస్తుతం సంవత్సరానికి 6.65 శాతం వడ్డీ రేటుతో హోం లోన్స్ అందిస్తోంది ఎస్​బీఐ.


అదనపు ప్రయోజనాలు..


ఇందులో వడ్డీ రేట్లు చాలా తక్కువ. దీనిలో ప్రాసెసింగ్​ ఫీజు అత్యంత తక్కువగా ఉంటుందని బ్యాంక్ పేర్కొంది.


ఇక ఇందులో ఎలాంటి పరోక్ష, అదనపు ఛార్జీలు (హిడెన్ ఛార్జెస్​) లేవని ఎస్​బీఐ స్పష్టం చేసింది. ఇందులో హోమ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో కూడా లభిస్తుంది. వడ్డీ రేట్లు మహిళలకైతే మరింత తక్కువగా ఉంటాయని తెలిసింది.


Also read: టాటా ప్లే DTH బంపర్ ఆఫర్.. రూ.49లకే ప్రముఖ OTTల సబ్‌స్క్రిప్షన్‌!


Also read: వాట్సాప్​లో క్రేజీ అప్​డేట్​- 32 మందితో గ్రూప్​ వీడియో కాల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook