SBI IMPS: ఎస్‌బీఐ ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంపు.. సర్వీస్ ఛార్జీల వివరాలివే..
SBI IMPS transaction limit hiked: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై ఎటువంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
SBI IMPS transaction limit hiked: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (State Bank of India) ఐఎంపీఎస్ (IMPS) ట్రాన్సాక్షన్స్ పరిమితిని పెంచింది. ఇప్పటివరకూ అమలులో ఉన్న రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, యోనో యాప్ సహా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా జరిపే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్‌కు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
ఎస్‌బీఐ బ్రాంచ్‌ల ద్వారా జరిపే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రం సర్వీస్ ఛార్జీలతో పాటు జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. NEFT,RTGS ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్‌కు వర్తించే సర్వీస్ ఛార్జీలే ఐఎంపీఎస్‌కు కూడా వర్తిస్తాయని వెల్లడించింది. ఐఎంపీఎస్ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఎస్‌బీఐ బ్రాంచ్‌ల ద్వారా చేసే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్‌కు వర్తించే సర్వీస్ ఛార్జీల వివరాలు :
- రూ.1000 వరకు ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవు.
- రూ.1000 - రూ.10,000 వరకు సర్వీస్ ఛార్జి రూ.2తో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.
- రూ.10,000 - రూ.1,00,000 వరకు రూ.4 సర్వీస్ ఛార్జీతో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.
- రూ.1,00,000 - రూ.2,00,00 వరకు రూ.12 సర్వీస్ ఛార్జీతో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.
- రూ.2,00,00 - రూ.5,00,000 వరకు రూ.20 సర్వీస్ ఛార్జీతో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.
ఐఎంపీఎస్ (Immediate Payment Service) :
ఐఎంపీఎస్ ద్వారా తక్షణ నగదు బదిలీ లావాదేవీలు జరపవచ్చు. NEFT, RTGS లాగే ఇది కూడా ఒక ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్ మెథడ్. NEFT, RTGS ట్రాన్సాక్షన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) నిర్వహిస్తుంది. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. ఐఎంపీఎస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రోత్సహించేందుకు గాను ఎస్‌బీఐ తాజాగా ఐఎంపీఎస్ పరిమితిని పెంచింది.
Also Read: Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది..
Also Read: India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook