SBI New Charges: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్, జులై 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు
SBI New Charges on cash withdrawal: భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (Basic Savings Bank Deposit) ఖాతాలపై ఛార్జీల మోత మోగించింది. సవరించిన సర్వీసు ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.
SBI New Charges on cash withdrawal: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) తన ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (Basic Savings Bank Deposit) ఖాతాలపై ఛార్జీల మోత మోగించింది. ఎస్‌బీఐ తాజాగా సవరించిన సర్వీసు ఛార్జీలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.
ఖాతాదారుల నగదు ఉపసంహరణ విషయానికొస్తే.. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మరియు ఏటీఎం కేంద్రాలలో కలిపి 4 పర్యాయాలు మాత్రమే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం ఛార్జీల విషయానికొస్తే.. ఏటీఎం మరియు బ్రాంచ్‌లలో గరిష్టంగా 4 పర్యాయాలు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేకుండా నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదనపు విలువ ఆధారిత సేవలకుగానూ జూలై 1, 2021 నుంచి ఛార్జీలు వసూలు చేయడంపై ఎస్‌బీఐ నిర్ణయం (SBI Customers Alert) తీసుకుంది. బ్రాంచ్‌లలో, ఏటీఏం కేంద్రాలో నగదు విత్‌డ్రా చేయడం, చెక్ బుక్‌కు సంబంధించిన ఛార్జీలు, బదిలీ చేయడం, ఆర్థికేతర లావాదేవిల విషయంలో ఛార్జీలు వసూలు చేస్తారు.
నగదు ఉపసంహరణకు ఎసీబీఐ సవరించిన ఛార్జీల వివరాలు (SBI Charges for cash withdrawal):
ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద లేదా ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేస్తే రూ.15తో అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు.
1) ఎస్‌బీఐ ఏటీఎంలు: రూ.15+GST
2) ఇతర బ్యాంకుల ఏటీఎంలు: రూ.15+GST
ఎస్‌బీఐ (State Bank Of India) చెక్కుల విషయంలో సవరించిన ఛార్జీల వివరాలు..
1) ఓ ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించే మొదటి 10 చెక్కులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు
2) ఆ తరువాత a) 10 చెక్కులు దాటిన తరువాత రూ.40 + GST చెల్లించాలి
b) 25 చెక్కులు దాటిన తరువాత రూ.75 + GST చెల్లించాలి
c) ఎమర్జెన్సీ చెక్ బుక్ విషయంలో 10 చెక్కుల వరకు రూ.50 + GST వసూలు చేస్తారు. సీనియర్ సిటిజన్లకు దీని నుంచి మినహాయింపు కల్పించారు.
Also Read: EPFO Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు బ్యాంక్ బ్రాంచులు, ఏటీఎం, సీడీఎంలలో ఎస్‌బీఐ మరియు ఇతర బ్యాంకులలో ఆర్థికేతర లావాదేవిలు పూర్తిగా ఉచితం. సొంత బ్రాంచులు మరియు వేరే ఎస్‌బీఐ బ్యాంకులలో సేవింగ్స్ ఖాతా ఉన్నవారి నుంచి నగదు బదిలీ లావాదేవిలు చేయడానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.