SBI Recruitment 2022: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేసింది. వివిధ పోస్టుల్లో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్న ఉద్యోగార్థులు అప్లయ్​ చేసుకోవచ్చని ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్ ప్రకారం..  'స్పెషలిస్ట్ క్యాడెర్​ ఆఫీసర్స్​' పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్​బీఐ. అసక్తు ఉన్నవారు ఎస్​బీఐ వెబ్​సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.


పోస్టులు, రిజర్వేషన్లు..


1.నెట్​వర్క్​ సెక్యురిటీ స్పెషలిస్ట్ క్యాటగిరీలో అసిస్టెంట్ పోస్టులు-15


ఇందులో 8 పోస్టులు జనరల్​. ఎస్సీ రిజర్వేషన్​-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఈడబ్ల్యూఎస్​ 1 చొప్పున రిజర్వ్​ చేసినట్లు ఎస్​బీఐ నోటిఫికేషన్​లో పేర్కొంది.


2.రూటింగ్ అండ్ స్విచ్చింగ్ క్యాటగిరీలో అసిస్టెంట్ మేనేజర్​ పోస్టులకు గానూ.. 33 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది ఎస్​బీఐ.


ఇందులో 15 జనరల్​, ఎ్సీ-5, ఎస్టీ-2, ఓబీసీ-8, ఈడబ్ల్యూఎస్​-3 చొప్పున రిజర్వ్​ చేసింది.


ఏజ్ లిమిట్ ఎంత?


రెండు పోస్టులకు.. గరిష్ఠంగా 40 ఏళ్లు (2021 ఆగస్టు నాటికి) మించకూడదని ఎస్​బీఐ తెలిపింది.


ఎలా దరఖాస్తు చేయాలి..


ఈ పోస్టులకు ఆన్​లైన్ ద్వారానే అప్లయ్ చేసే వీలుంది. ఆఫ్​లైన్ మోడ్​లో దరఖాస్తుకు వీలు లేదు. ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


  • ఈ రెండు పోస్టులకు ఆన్​లైన్ దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ.. ఫిబ్రవరి 25.

  • దరఖాస్తు పంపిన అభ్యర్థులందరికీ మార్చి 20న ఆన్​లైన్ టెస్ట్ ఉండొచ్చు.


Also read: Amazon Hitachi AC: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!


Also read: iPhone 12 offer: ఐఫోన్​ 12పై అమెజాన్​లో రూ.25 వేల వరకు తగ్గింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook