Second Hand Hyundai Creta Cars Under Rs 8 Lakhs: హ్యుందాయ్ క్రెటా కారు ఎక్స్ షోరూమ్ ధర బేసిక్ వేరియంట్ కి రూ. 10.84 లక్షలతో మొదలై టాప్ వేరియంట్ కి రూ. 19.13 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధరకు అదనంగా వెహికిల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి ఛార్జీలు అన్నీ కలిపి ఆన్-రోడ్ వచ్చేసరికి కారు ధర కనీసంలో కనీసం మరో 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెరుగుతుంది. అంటే బేసిక్ వేరియంట్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు ఎంత లేదన్నా సుమారు రూ. 12 లక్షల నుంచి 21 లక్షల వరకు ఉంటుంది. అలాంటప్పుడు కొత్త హ్యూందాయ్ క్రెటా కారును కొనుగోలు చేయడానికి అంత డబ్బులు వెచ్చించలేని వాళ్లు ఆల్రెడీ యూజ్ చేసిన సెకండ్ హ్యాండ్ క్రెటా కార్లను కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతారు అనే విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాత కార్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో కారు కొనాలనే వారి కోరిక కూడా తీరుతుంది. అలాగే డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. అలాగే కొత్త కారును బుకింగ్ చేసుకుని డెలివరీ కోసం వేచిచూసినట్టుగా సెకండ్ హ్యాండ్ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా అక్కర్లేదు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడు అంటే అప్పుడే కారు వెంటనే డెలివరి అయిపోతుంది. అందుకే అలా యూజ్ డ్ క్రెటా కారు కొనుగోలు చేయాలని చూసే వారికోసనే ఇక్కడ మేం ఓ జాబితా అందిస్తున్నాం. ఈ క్రెటా కార్ల ధర దాదాపు రూ 8 లక్షలకు కాస్త అటుఇటుగా ఉంటుంది. కార్స్ 24 అధికారిక వెబ్‌సైట్‌లో అడ్వర్టైజ్ చేసిన ఈ కార్లపై మీరు కూడా ఓ లుక్కేయండి.


2015 నాటి మోడల్‌కి చెందిన హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ గేర్ సిస్టం కారు నోయిడాలో విక్రయానికి రెడీగా ఉంది. ఈ కారు ధర కేవలం రూ. 7,72,000 మాత్రమే. అంటే నిండా 8 లక్షలు కూడా లేదన్నమాట. ఈ కారు ఇప్పటివరకు 56,027 కి.మీ ప్రయాణించింది. డీజిల్ ఇంజిన్ వెర్షన్ అయిన ఈ కారు ఇప్పటి వరకు ఒక్క యజమాని చేతిలోనే రన్ అయింది. ఈ కారు రిజిస్ట్రేషన్ సంఖ్య DL-8Cతో ప్రారంభం అవుతుంది.


2015 మోడల్ కి చెందిన హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ గేర్ సిస్టం కారు నోయిడాలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ధర రూ.7,81,000 మాత్రమే. అంటే ఇది కూడా 8 లక్షల రూపాయల లోపే లభిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ DL-1Cతో ప్రారంభం అయ్యే ఈ పెట్రోల్ ఇంజన్ కారు ఇప్పటివరకు 49,909 కిలోమీటర్లు రన్ అయింది. యజమాని కూడా మొదటి వ్యక్తే కావడం విశేషం.


2015 నాటి హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ గేర్ సిస్టం కారు ఇది. నోయిడాలో విక్రయానికి రెడీగా ఉన్న ఈ కారు ధర రూ.8,47,000 గా ఉంది. ఇప్పటివరకు ఈ కారు 27,923 కి.మీ తిరిగింది. మొదటి యజమాని చేతిలో ఉన్న ఈ పెట్రోల్ ఇంజన్ కారు రిజిస్ట్రేషన్ UP-32తో ప్రారంభం అవుతుంది.


2018 హ్యుందాయ్ క్రెటా 1.4 S CRDI మాన్యువల్ కారు నోయిడాలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ డీజిల్ ఇంజన్ కారు ధర రూ. 8,48,000. UP-16తో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రారంభమైన ఈ కారు ఇప్పటివరకు మొత్తం 84,661 కి.మీ ప్రయాణించింది.


ఇది కూడా చదవండి : Honda Cars Prices: హోండా కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్


ఇది కూడా చదవండి : PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే..


ఇది కూడా చదవండి : 7 Seater Car: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK