Purchage Second Hand Hyundai Creta Just Rs 8 lakh in Cars24: 'సెకండ్ హ్యాండ్' కార్ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటాకు మంచి డిమాండ్ ఉంది. కొత్త క్రెటా కంటే ఎక్కువ క్రేజ్ పాత క్రెటాలకే ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు కూడా పాత హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొన్ని ఎంపికలు ఉన్నాయి. కార్స్ 24 వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. వాటి ధర సుమారు రూ. 8 లక్షలు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి రోడ్ టాక్స్. రిజిస్ట్రేషన్ సమయంలో ఇప్పటికే రోడ్ టాక్స్ చెల్లించినందున ఇప్పుడు రహదారి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015 Hyundai Creta 1.6 SX (O) CRDI MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన 2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ కారు 56,461 కిమీలు ప్రయాణించింది. ఇది డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుండగా.. ప్రస్తుతం మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు నంబర్ ప్లేట్ DL-8C నుంచి  ప్రారంభమవుతుంది.  ఇది ఢిల్లీలో రూ.7,65,000 ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది.


2015 Hyundai Creta 1.6 S MANUAL:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ రీడింగ్ 28,025 కిమీలు. ఇది పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండగా.. మొదటి యజమాని వద్ద ఉంది. ఈ కారు నంబర్ ప్లేట్ UP-32 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఢిల్లీలో రూ.7,91,000 ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది.


2016 Hyundai Creta 1.6 S MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2016 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ అమ్మకానికి ఉంది. ఈ కారు రీడింగ్ మొత్తం 65,531 కిమీ. ఈ కారు కూడా పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు నంబర్ సంఖ్య DL-7Cతో ప్రారంభమవుతుంది. ఢిల్లీలో రూ.8,18,000 ధరకు విక్రయానికి అందుబాటులో ఉంది.


2017 Hyundai Creta 1.4 S PLUS MANUAL:
2017 హ్యుందాయ్ క్రెటా 1.4 S ప్లస్ మాన్యువల్ ఢిల్లీలో రూ.8,59,000 ధరకు అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు రీడింగ్ 58,830 కిలోమీటర్లు. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు నంబర్ ప్లేట్ DL-1Cతో ప్రారంభమవుతుంది.


Also Read: AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!  


Also Read: Tata Nexon Price 2023: బెస్ట్ సెల్లింగ్ కారు టాటా నెక్సాన్‌ను కేవలం 1.5 లక్షలకే ఇంటికి తీసుకుకెళ్లండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.