Senior Citizens Savings Scheme: పదవీ విరమణ తరువాత సేవింగ్స్ అనేవి చాలా కీలక భూమిక వహిస్తాయి. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని రిస్క్ ఉన్న చోట పెట్టుబడి పెట్టలేరు. మార్కెట్ రిస్క్ ఎదుర్కొనే పరిస్థితి ఆ వయస్సులో ఉండదు. అందుకే సేవింగ్స్‌కు ఏది మంచి మార్గమో ఎంపిక చేసుకుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది మంచి ప్రత్యామ్నాయం కాగలదు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ ఎక్కౌంట్ లేదా విడివిడిగా ఓపెన్ చేయవచ్చు. ఇది ప్రతి పోస్టాఫీసులో అందుబాటులో ఉండే అద్భుతమైన స్కీమ్. ఈ పధకానికి 100 శాతం సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడీ పధకంలో గరిష్టంగా డిపాజిట్ చేసే పరిమితి పెరగడంతో సహజంగానే వడ్డీ మరింత పెరుగుతుంటుంది. అందుకే ఈ పధకం ఇప్పుడు మరింతగా ఆకట్టుకుంటోంది. 


ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో గరిష్టంగా 30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు 15 లక్షలకే అవకాశముండేది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ పధకంపై వార్షిక వడ్డీని 8.02కు పెంచింది ప్రభుత్వం. ఈ పధకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తం 1000 రూపాయలుగా ఉంది. గరిష్టంగా 30 లక్షలు పెట్టవచ్చు. సెక్షన్ 80 సి ప్రకారం 1.50 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. 


భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా 60 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.  ఐదేళ్లకు మెచ్యూరిటీ అయ్యాక మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. మీ వయస్సు 60 ఏళ్లు దాటి లేదా 55-60 ఏళ్లకు రిటైర్ అయుంటే ఈ పధకంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశముంటుంది. 


60 లక్షలు గరిష్టంగా ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల మెచ్యూరిటీ తరువాత 8.02 వార్షిక వడ్డీతో  నెలకు వడ్డీ రూపంలోనే 40,100 రూపాయలు లభిస్తుంది. ఏడాదికి వచ్చే వడ్డీ లెక్కి్తే 4,81,200 రూపాయలుగా ఉంటుంది. అదే ఐదేళ్లకు అయితే 24 లక్షల 6 వేల రూపాయలు ఈ పధకంపై కేవలం వడ్డీ వస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే 60 లక్షలకు అదనంగా మరో 234 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. 


అదే సింగిల్ ఎక్కౌంట్ గరిష్టంగా 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల కాల పరిమితికి వార్షిక వడ్డీ 8.02 చొప్పున నెలకు వచ్చే వడ్డీ 20 వేల 50 రూపాయలు. ఏడాదికి 2,40,600 రూపాయలవుతుంది. ఐదేళ్లకు 12 లక్షల 3 వేలవుతుంది. అంటే 5 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసే 30 లక్షలకు అదనంగా మరో 12 లక్షలు వచ్చిచేరతాయి. 


Also read: AP Politics: తెలుగుదేశం పార్టీకు ఎంపీ అభ్యర్ధులు కావలెను



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook