Stock Market today: స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించిన బేర్- రికార్డు స్థాయిలో నష్టాలు..
స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆందోళనలతో ఇటీవలి కాలంలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆందోళనలతో ఇటీవలి కాలంలోనే అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1747 పాయింట్లు కోల్పోయి 56,405 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ-నిఫ్టీ 531 పాయింట్లు పడిపోయి 16,842 వద్ద స్థిరపడింది.
అన్ని రంగాలు నష్టాలను నమోదు చేశాయి. లోహ, బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.
ఈ స్థాయిలో నష్టాలు ఎందుకంటే..
ఉక్రెయిన్-రష్యాల మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా తారా స్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య యుధ్ద వాతావరణం నెలకొంది. ఈ భయాలతో అటు అంతర్జాతీయంగాను దాదాపు అన్ని మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. దీనితో ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడిందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,191 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇక ఒకానొక దశలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో 56,295 స్థాయికి పడిపోయింది.
నిఫ్టీ కూడా 17,099 అత్యధిక స్థాయిని తాకగా.. ఓ దశలో 16,861 వద్దకు చేరింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
30 షెర్ల ఇండెక్స్‌లో కేవలం టీసీఎస్ మాత్రమే 0.93 శాతం లాభాన్ని నమోదు చేసింది. మిగతా 29 కంపెనీలు నష్టపోయాయి.
టాటా స్టీల్ అత్యధికంగా 5.80 శాతం నష్టాన్ని నమోదు చేసింది. హెచ్డీఎఫ్ 5.58 శాతం, ఎస్బీఐ 5.51 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.94 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.67 శాతం నష్టాన్ను మూటగట్టుకున్నాయి.
Also read: Fuel price hike: త్వరలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు?
Aslo read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook