స్టాక్ మార్కెట్లకు మూడో రోజూ నష్టాలు- లిస్టింగ్ రోజే పేటీఎం రికార్డు పతనం
Stock Market News: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు తగ్గాయి.
Stock Market Update: స్టాక్ మార్కెట్లు గురువారం (Stocks closing bell) కూడా నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) 372 పాయింట్లు కోల్పోయి 59,636 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 134 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద స్థిరపడింది.
మార్కెట్లు నష్టాలను మూటగట్టుకోవడం వరుసగా ఇది మూడో సెషన్.
దాదాపు అన్ని రంగాలు డీలా పడ్డాయి. బ్యాంకింగ్ షేర్లు కాస్త స్థిరంగా కొనసాగాయి. ఆటోమొబైల్, ఐటీ షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూలతలు కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 60,177 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 59,376 కనష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,945 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,688 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.
Also read: బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
ఎస్బీఐ అత్యధికంగా 1.16 శాతం లభాపడింది. పవర్‌గ్రిడ్ 0.63 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.35 శాతం, హెచ్‌యూఎల్ 0.16 శాతం పుంజుకున్నాయి.
ఎం అండ్ ఎం అత్యధికంగా 3.28 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా 3.21 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 2.88 శాతం, ఎల్ అండ్ టీ 2.74 శాతం, టాటా స్టీల్ 2.72 శాతం నష్టపోయాయి.
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 6 కంపెనీలు లాభాలను గడించాయి. 24 కంపెనీలు నష్టపోయాయి.
Also read: డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం- అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా జోరు!
Also read: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బడ్జెట్ ఎయిర్‌లైన్ 'ఆకాశ' రెండు భారీ డీల్స్!
పేటీఎం ఫ్లాప్ లిస్టింగ్...
భారీ అంచనాలలతో లిస్టింగ్‌కు వచ్చిన పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్) మదుపరులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐపీఓలో అదరొగట్టిన పేటీఎం (Paytm IPO) తొలి రోజు లిస్టింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభించింది. ఆరంభంలోనే 9 శాతానికిపైగా పడిపోయింది. చివరకు 27.25 శాతం నష్టంతో రూ.1,564 వద్ద ముగిసింది. ఐపీఓ ధరతో పోలిస్తే మదుపరులకు రూ.585 నష్టాన్ని మిగిల్చింది.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. థైవాన్ సూచీ లాభాలను గడించింది.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), హాంకాంగ్, సూచీలు భారీగా నష్టపోయాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.04 శాతం తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.23 వద్ద కొనసాగుతోంది.
Also read: 2021-22 క్యూ4లో ఎల్ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్‌యూల ప్రైవేటీకరణ కూడా!
Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook