షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు అద్భుత లాభాల్ని ఇస్తుంటాయి. స్వల్పకాలంలో అధిక రిటర్న్స్ ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఒకటి..ఏడాది వ్యవధిలో ఊహించని లాభాల్ని ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో స్వల్పకాలంలో ఎక్కవ లాభాల్ని ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. అలాంటిదే ఒక షేర్ ఇప్పుడు ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇన్వెస్టర్ల పెట్టుబడిని ఎన్నోరెట్లు పెంచింది. ఆగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ ఇది. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్ల లక్ష రూపాయల పెట్టుబడిని 14 లక్షలుగా మార్చింది.


అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ ఇన్వెస్టర్లకు ఊహించని లాభాన్నిచ్చింది. రెండేళ్ల క్రితం ఈ షేర్ 50 రూపాయల కంటే తక్కువకు ట్రెడ్ అయింది. ఈ షేర్ ధర ఇప్పుడు 700 రూపాయలు దాటేసింది. 2020 ఏప్రిల్ 3న ఎన్ఎస్ఈలో ఈ షేర్ క్లోజింగ్ ధర 48.65 రూపాయలుంది. ఆ తరువాత ఈ షేర్ ధరలో భారీగా పెరుగుదల నమోదైంది.


ఇదే షేర్ ఏప్రిల్ 1, 2021 నాటికి 158.75 రూపాయలైంది. ఈ తరువాత మరో ఏడాదికి అంటే ఏప్రిల్ 29, 2022 నాటికి 696.30 రూపాయలకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో రెండేళ్లలోనే ఈ షేర్ విలువ ఎన్నోరెట్లకు పెరిగింది. ఆ తరువాత ఈ షేర్ మళ్లీ తగ్గుముఖం పట్టింది. జూలై నాటికి 450 రూపాయలకు చేరుకుంది. తిరిగి మళ్లీ పెరుగుతూ..ఇప్పుడు 700 రూపాయలకు చేరుకుంది. 


అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌కు చెందిన ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర 746.20 రూపాయలు కాగా, కనిష్ట ధర 310.20 రూపాయలుంది. అక్టోబర్ 25 నాటికి ఈ షేర్ ధర 703.05 రూపాయలకు చేరుకుంది. రెండేళ్ల క్రితం షేర్ ధర 50 రూపాయలున్నప్పుడు 1 లక్షల రూపాయలతో 2000 షేర్లు కొనుగోలు చేసుంటే..ఇప్పుడు 700 ధరతో 14 లక్షల రూపాయలయ్యేది. 


Also read: November Bank Holidays: నవంబర్ నెలలో 10 రోజుల బ్యాంకులకు సెలవు, ఎక్కడ, ఎప్పుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook