Top Mutual Funds: మ్యూచ్యువల్ ఫండ్స్‌లో మొత్తం మూడు రకాలుంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. వీటిలో ఈ మధ్యకాలంలో కొన్ని మ్యూచ్యువల్ ఫండ్స్ గణనీయమైన లాభాల్ని అందించాయి. ఏడాది వ్యవధిలో 44 నుంచి 70 శాతం లాభాలు అందించిన మ్యూచ్యువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసుంటే రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలించుకోవల్సిన సమయం ఇది. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఏడాది కాలంలో ఎంత రిటర్న్ ఇచ్చిందనేది తెలుసుకుంటే భవిష్యత్తులో ఏ మేరకు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచించుకోవచ్చు.  గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాల్ని అందించిన స్మాల్ క్యాప్ మ్యూచ్యువల్ ఫండ్స్ ఏమున్నాయో పరిశీలిద్దాం.


బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 69.54 శాతం లాభాల్ని అందించింది. ఇక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే 66.51 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 65.84 శాతం లాభాలిచ్చింది. ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 62.71 శాతం, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 53.24 శాతం, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్లర్ కంపెనీస్ ఫండ్ 52.90 శాతం రిటర్న్స్ అందించింది. 


ఇక మిడ్ క్యాఫ్ ఫండ్స్ విషయానికొస్తే చాలామందికి 56-65 శాతం లాభాలు చేతికి అందాయి. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్‌లో 65.56 శాతం, ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్‌లో 62.70 శాతం, మోతీలాల్ ఓశ్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 60.37 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 59.61 శాతం, హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్ 57.23 శాతం, జేఎం మిడ్ క్యాప్ ఫండ్ 56.98 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.


ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ పరిశీలిస్తే చాలామంది ఇన్వెస్టర్లకు 44 నుంచి 52 శాతం లాభాలు దక్కాయి. ఇందులో క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్ 52.38 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్ 47.74 శాతం, జేఎం లార్జ్ క్యాప్ ఫండ్ 45.42 శాతం, నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 44.82 శాతం, టారస్ లార్జ్ క్యాప్ ఫండ్ 44.04 శాతం లాభాలు ఇచ్చాయి. 


Also read: Best mutual funds: ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే.. మీ రాబడి 70 శాతం పెరగడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook