SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదన
SIP Benefits: దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన రిటర్న్స్ పొందాలంటే షేర్ మార్కెట్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ స్థూలంగా చెప్పాలంటే సిప్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
SIP Benefits: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం. నేరుగా షేర్ మార్కెట్‌లో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టకుండా సిప్ ద్వారా తోచినంత, స్థోమతకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అందుకే దీనిని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు.
బాగా డబ్బులు సంపాదించాలని, ఆర్ధికంగా స్థిరపడాలని అందరికీ ఉంటుంది. కానీ అందుకు సరైన మార్గాలు అనుసరించడంలో విఫలమౌతుంటారు. క్రమబద్ధీయుతంగా పెట్టుబడి పెడుతూ పోతే కచ్చితంగా లక్షాధికారిగానో, కోటీశ్వరులుగానో మారవచ్చు. సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నిర్ణీత కాల వ్యవధి తరువాత ఏకంగా 5 కోట్లు సంపాదించవచ్చు. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో నెలకు కొద్దిమొత్తం జమ చేయడం ద్వారా మీ సంపద క్రమంగా పెంచుకోవచ్చు. మ్యూచ్యువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ లింక్ కలిగినవి. ఒక్కోసారి అధిక రిటర్న్స్ అందిస్తుంటాయి.
5 కోట్లు ఆర్జించాలంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి
ప్రతి నెలా 50 వేల రూపాయలను 10 శాతం పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటే 12 శాతం రిటర్న్స్ పొందవచ్చు. 7 ఏళ్లలో ఈ లెక్కన మీరు 80 లక్షలు కూడబెడతారు. మరో 3 ఏళ్లలో ఇంకో 80 లక్షలు అవుతాయి. ఆ తరువాత రెండేళ్లలోనే 80 లక్షలు ఆర్జిస్తారు. ఇలా 10 ఏళ్లకు 1.60 కోట్లు సంపాదించవచ్చు. 13వ ఏట 3.2 కోట్లు అవుతాయి.
ప్రతి నెలా 10 శాతం పెంచుకుంటూ నెలకు 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంటే 17వ ఏట 12 శాతం రిటర్న్స్ చొప్పున 5.6 కోట్లు అవుతుంది. కొన్ని సందర్భాల్లో రిటర్న్స్ అనేవి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. 10 శాతం చొప్పున పెంచకుండా నెలకు 50 వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే 5 కోట్లు ఆర్జించేందుకు మరి కొద్దిగా సమయం పడుతుంది. మొదటి 80 లక్షలకు 8 ఏళ్లు పడుతుంది. రెండవ 80 లక్షలకు 4 ఏళ్లు, మూడవ 80 లక్షలకు 3 ఏళ్లు పడుతుంది.
Also read: 7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook