షేర్ మార్కెట్‌లో పెట్టుబడి అంటే అంత సులభమేం కాదు. షేర్ మార్కెట్ అనేది కన్పిస్తున్నంత సులువు కానేకాదు. అయితే కొన్ని కీలకమైన విషయాల్ని పరిగణలో తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన లాభాల్ని ఆర్జింజవచ్చు. ఆ సూచనలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్ అనేది అంచనాల ఆధారంగా ఉంటుంది. అంచనా కచ్చితంగా ఉంటే లాభాలు ఆర్జించవచ్చు. రానున్న రోజుల్లో కొన్ని రంగాలకు చెందిన కంపెనీలు ప్రభావం చూపించవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రిటర్న్స్ ఉంటాయి. దీని గురించి మార్కెట్ నిపుణులు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


షేర్ మార్కెట్‌లో దీర్ఘకాలం పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్టర్లు రిటర్న్ ఎక్స్‌పెక్టే,షన్‌పై దృష్టి సారించాలి. ఎంతకాలం కోసం పెట్టబడి పెడుతున్నామనేది ఆలోచించాలి. దీంతోపాటు రుణం లేదా చేబదులు తీసుకున్న డబ్బును షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. చాలామంది ఇదే తప్పు చేసి తరువాత బాధపడుతుంటారు. ఎప్పుడూ మన సేవింగ్ డబ్బుల్నే షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టాలి. లేకపోతే లేనిపోని కష్టాలు కొనితెచ్చుకోవల్సి ఉంటుంది. 


రానున్న రోజుల్లో షేర్ మార్కెట్‌లో కొన్ని రకాల కంపెనీలు అగ్రస్థానంలో ఉండవచ్చు. ముఖ్యంగా 4 రకాల రంగాల్లో  పెట్టుబడి అధిక లాభాల్ని ఆర్జిస్తుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఐటీ రంగం, హెల్త్ కేర్ సెక్టార్, బ్యాంకింగ్ , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అద్భుతమైన వృద్ధి కన్పించవచ్చు


Also read: Cheque Bounce Rules: చెక్ బౌన్స్ ఇకపై మరింత కఠినం, కొత్త నియమాలకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ యోచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook