Share Market Status: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుంటుంది. కానీ ఎందులో పెట్టాలనే విషయంపై సందిగ్దత ఉంటుంది. షేర్ మార్కెట్‌లో ఏ కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో నిశితంగా పరిశీలించి పెట్టుబడులు పెడితే రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ గత వారం అధిక లాభాల్ని ఆర్జించింది. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల గురించి తెలుసుకుందాం..


షేర్ మార్కెట్ అనేది ఎప్పుడూ ఎగుడుదిగుడులకు లోనవుతుంటుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీలో పది కంపెనీల్లోంచి ఆరు కంపెనీల మార్కెట్ వాటా గత వారంతో పోలిస్తే...1,56,247.35 కోట్ల రూపాయలు పెరిగింది. ఇందులో అత్యధికంగా లాభపడింది రిలయన్స్. వారాంతంలో రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల మార్కెట్ వాటా పెరిగింది. అటు ఇన్‌ఫోసిస్, హిందూస్తాన్ యూనీలివర్, ఎల్ఐసీల్లో మార్కెట్ వాటా క్షీణించింది. మంగళవారం నాడు మొహర్రం సందర్భంగా మార్కెట్ క్లోజ్‌లో ఉంది.


టాప్ 3 కంపెనీల్లో..


వారాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా 66,772.08 కోట్ల రూపాయలు పెరిగి..17,81,028.47 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ పరిస్థితి 12,642.03 కోట్లు పెరిగి..12,44,004.29 కోట్లకు చేరుకోగా..హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు 32,346.90 కోట్లు పెరిగి..8,25,207.35 కోట్లకు చేరుకుంది. 


ఇతర కంపెనీలు


ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ 25,467.37 కోట్లు పెరిగి 6,08,729.12 కోట్లకు చేరుకుంది. అటు హెచ్‌డీఎఫ్‌సి 18,679.93 కోట్లు పెరిగి..4,45,759.90 కోట్లకు చేరుకుంది. ఇక బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ 339.04 కోట్లు పెరిగి 4,42,496.12 కోట్లకు చేరుకుంది. 


నష్టాలెదుర్కొన్న కంపెనీలు


అటు ఇన్‌ఫోసిస్ కంపెనీ 9,262.29 కోట్లు తగ్గి 6,70,920.64 కోట్లకు చేరుకుంది. హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీ మార్కెట్ వాటా 11,454.26 కోట్ల నష్టంతో 6,09,765.92 కోట్లకు చేరుకుంది. ఎల్ఐసీ మార్కెట్ వాటా 3,289 కోట్లు తగ్గడంతో 4,31,459.72 కోట్లకు చేరుకుంది. ఇక ఎస్బీఐ కూడా 4,73,584.52 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. 


టాప్ 10 కంపెనీలు ఇవే


రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిస్థానంలో ఉంది. ఆ తరువాత క్రమంగా టీసీఎస్, హెచ్‌డి‌ఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలివర్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐసీలు ఉన్నాయి. గత వారం బీఎస్ఈ 30 షెర్ల సెన్సెక్స్ 1,074 అంకెలు లేదా 1.83 శాతం లాభంలో ఉంది. అటు నిఫ్టీ 300 అంకెలు లేదా 1.95 శాతం పెరిగింది. ఓవరాల్‌గా మార్కెట్ వరుసగా నాలుగోవారం లాభాలు ఆర్జించింది. 


Also read: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook