Skoda Kylaq Price: అతి త్వరలోనే మంచి ఫీచర్స్ అత్యధిక మైలేజ్ కలిగిన స్మార్ట్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అతి త్వరలోనే మార్కెట్లోకి స్కోడా అద్భుతమైన SUV ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనిని కంపెనీ మొదటి సబ్ 4-మీటర్ SUV గా అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే కంపెనీ దీని పేరుని కూడా ప్రకటించింది. ఈ SUV స్కోడా కైలాక్ (skoda kylaq) పేరుతో కస్టమర్స్ కి పరిచయం కాబోతోంది. దీనిని కంపెనీ నవంబర్ 6వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే వీటి విక్రయాలు మాత్రం 2025 సంవత్సరం మార్చిలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కైలాక్ మోడల్ గతంలో మార్కెట్లోకి విడుదలైన కుషాక్‌తో సమానంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని ఫీచర్స్ కూడా సేమ్ టు సేమ్ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ కైలాక్ (skoda kylaq)  కొత్త స్టైలింగ్‌లో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా ఇది అద్భుతమైన నిలువు గ్రిల్ స్లాట్ తో పాటు పెద్ద ఎయిర్ డ్యాములతో రాబోతోంది. అయితే స్కోడా కంపెనీ దీనిని భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లను దృష్టిలో పెట్టుకొని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ఇది అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇది మార్కెట్లోకి విడుదల అయితే టాటా నెక్సన్, టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కార్లతో పోటీ పడే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.



అంతేకాకుండా ఇప్పటికే స్కోడా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన స్లావియా, కుషాక్ కార్లు NCAP గ్లోబల్ భద్రత క్రాష్ టెస్టింగ్‌లో భాగంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ని సంపాదించుకున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లోకి విడుదల కాబోయే కైలాక్ (skoda kylaq) కూడా మంచి సేఫ్టీ రేటింగ్ తో విడుదల కాబోతోంది ఇది సబ్-4 మీటర్ల SUV విభాగంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారును స్కోడా కంపెనీ గతంలో విడుదల చేసిన వాటికంటే ఎక్కువ శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారు అద్భుతమైన కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రానుంది.


ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!
ఇక ఈ కార్ (skoda kylaq) కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన పవర్‌ట్రెయిన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఇంజన్ గరిష్టంగా 115bhp శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా178Nm టార్కును ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక దీనిని స్కోడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే దీని హై ఎండ్ ధర మాత్రం రూ.15 లక్షలకు పైగానే ఉంటున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఈ కారులో అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: Big Billion Days 2024: కళ్లు జిగేల్‌ అనే డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.6,000కే iPhone సిరీస్‌ మొబైల్స్ ప్రారంభం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.