The Sovereign Gold Bond Scheme 2021-22 - Series- VIII will be open for subscription from today: మన దేశ సంప్రదాయాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అవసరమైనప్పుడు దీనిని అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటారు. అందుకే దీనిని ఉత్తమ, సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు మారుతున్న పరిస్థితులతో బంగారంపై పెట్టుబడి పెట్టే పద్ధతుల్లోనూ భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బంగారంపై ఇప్పుడు నగల రూపంలో మాత్రమే కాకుండా డిజిటల్ రూపంలో కూడా పెట్టుబడి పెట్టేందుకు అవకాశముంది.


డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్తమ మార్గాల్లో సార్వ భౌమ పసిడి బాండ్లు (ఎస్​జీబీలు) ముఖ్యమైనవి. ఎందుకంటే.. వీటికి ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. ఎస్​జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్​బీఐ జారీ చేస్తుంటుంది. ప్రతి నెల విడతల వారీగా వీటిని జారీ చేస్తుంది.


నేటి నుంచి అందుబాటులోకి..


ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరం సిరీస్​ 8 సార్వ భౌమ పసిడి బాండ్లు (Series 8 Gold bond) నేటి నుంచి (నవంబర్ 29 సోమవారం) నుంచి అందుబాటులోకి వచ్చాయి. డిసెంబర్ 3 వరకు వీటిని సబ్​స్క్రైబ్​ చేసుకునేందుకు (SGB Subscription last date) వీలుంది.


ఈ సిరీస్​కు గ్రాము బంగారం ధరను (SGB Issue price) రూ.4,741గా నిర్ణయించింది ఆర్​బీఐ. వీటిని కోనుగోలు చేసే వారు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపితే రూ.50 తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ఆర్​బీఐ వెల్లడించింది.


సబ్​స్రైబ్ చేసుకున్న గోల్డ్ ఎస్​​జీబీలు డిసెంబర్ 7న లబ్ధిదారుల ఖాతాలో జమ (SGB Allotment date) అవుతాయి.


ఎస్​​జీబీలను ఎక్కడ కొనుగోలు చేయొచ్చు?


సౌర్వభౌమ పసిడి బాండ్లను.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీస్​లు, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు చేసేందుకు (How to Buy SGB) వీలుంది. ఒక వ్యక్తి 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు.


ఏమిటి ఈ గోల్డ్ బాండ్లు?


బంగారంపై మదుపును మళ్లించేందుకు కేంద్రం వీటిని 2015లో అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం జారీ చేసే సాధారణ బాండ్ల లాంటివే ఇవి కూడా. వీట్లోలో పెట్టుబడి ద్వారా వార్షికంగా 2.5 శాతం వడ్డీని పొందొచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఓ సారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.


ప్రయోజనాలు..


భౌతికంగా బంగారంలో ఉండే తరుగు, నష్ట భయాలు ఇందులో ఉండవు. దీనిని కొనుగోలు చేయడం సులభతరం.


దీనిపై మూలధన లాభాల పన్ను వర్తించదు. టీడీఎస్​ కూడా మినహాయింపు ఉంది.


Also read: స్వల్పంగా తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు


Also read: Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్​- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook