Special Fixed Deposit Schemes: వినియోగదారులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్‌లను పరిచయం చేస్తున్నాయి. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సాధారణ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐడీడీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ పథకాలను తీసుకువచ్చాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు కాస్త వడ్డీ రేటు ఎక్కువగానే ఉంది.  ఈ స్కీమ్స్‌ పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

400 రోజుల వ్యవధితో ఎస్‌బీఐ అమృత్ కలాష్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2023. 400 రోజుల స్కీమ్‌పై సాధారణ వినియోగదారులకు 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు, సిబ్బంది, పెన్షనర్లు వారి సంబంధిత వర్గాలకు అదనపు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఎస్‌బీఐ బ్రాంచ్, ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 


IDBI బ్యాంక్‌'ఉత్సవ్ ఎఫ్‌డీ' 375 రోజులు, 444 రోజుల సమయాలకు రెండు డిపాజిట్ స్కీమ్‌లను తీసుకువచ్చింది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆఖరి తేదీ డిసెంబర్ 31, 2023. IDBI బ్యాంక్ జనరల్/NRE/NRO కస్టమర్లకు 375 రోజుల పాటు 7.10 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీని అందిస్తుంది. 444 రోజులకు జనరల్/NRE/NRO పబ్లిక్‌కు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.


ఇండియన్ బ్యాంక్ IND SUPER 400 DAYS అనే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. “IND SUPER 400 DAYS” FD/MMD రూపంలో 400 రోజుల ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ టెన్యూర్‌తో అధిక వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్‌లో కస్టమర్లు కనీసం రూ.10 వేలు, గరిష్టంగా రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణ కస్టమర్లకు వడ్డీ రేటు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తోంది.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి