Amrit Kalash Yojana Scheme Interest Rate: కాలానుగుణంగా తమ వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పథకాలు తీసుకువస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఎస్‌బీఐ అమృత్ కలాష్ యోజన స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి సాధారణ ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. 400 రోజుల కాలవ్యవధి కోసం రూ.2 కోట్ల కంటే తక్కువ ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణ వినియోగదారులకు  7.10 శాతం వడ్డీని అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి ఒక రోజు మాత్రమే సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 15వ తేదీ తరువాత ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎఫ్‌డీ పథకం వ్యవధి 400 రోజులు. మీరు ఈ పథకంలో 400 రోజుల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ ప్రయోజనం నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. టీడీఎస్‌ తీసివేసిన తర్వాత వడ్డీ మొత్తం మీ అకౌంట్‌కు జమ అవుతుంది. ఎవరైనా పెట్టుబడిదారుడు ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే వడ్డీగా రూ.8017 లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ కాలంలో వడ్డీగా రూ.8600 పొందుతారు.


అమృత్ కలాష్ యోజన పథకం ప్రత్యేకతలు ఇవే..


==> ఈ స్కీమ్‌లో లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
==> మీరు ఈ ప్లాన్‌లో ఎప్పుడైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. 
==> రూ.2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. 
==> యోనో బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
==> నేరుగా ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సందర్శించి ఇన్వెస్ట్ చేయవచ్చు.


Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్  


Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి