Stock Market today: స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు- 58,800 పైకి సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల (Stocks closing bell) సెషన్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి.
Stock Market Updates: స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల (Stocks closing bell) సెషన్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 157 పాయింట్లు పెరిగి.. 58,807 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 47 పాయింట్ల లాభంతో 17,516 వద్ద స్థిరపడింది.
ఒమిక్రాన్ భయాల కారణంగా ఇటీవల భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి స్టాక్ మార్కెట్లు. ఈ నేపథ్యంలో ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల.. నేటి సెషన్ మొత్తం ఊగిసలాటలో సాగింది. ఎట్టకేలకు ఎఫ్ఎంసీజీ, ఐటీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్ల అండతో స్వల్ప లాభాలతో ముగిశాయి. విద్యుత్, బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 58,889 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,340 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,543 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,379 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 15 కంపెనీలు సానుకూలంగా స్పందించగా.. 15 కంపెనీలు డీలా పడ్డాయి.
ఐటీసీ 4.60 శాతం, ఎల్&టీ 3.18 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.97 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.59 శాతం, బజాజ్ ఫినాన్స్ 1.03 శాతం లాభాలను గడించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.72 శాతం, టైటాన్ 1.32 శాతం, నెస్లే 0.99 శాతం, ఎన్టీపీసీ 0.94 శాతం, పవర్ గ్రిడ్ 0.83 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి.
టోక్యో (జపాన్) సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.
రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.07 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.52 వద్ద కొనసాగుతోంది.
Also read: PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్- ఈ నెల 25 లోపు ఖాతాల్లో రూ.2 వేలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook