Stock Market today: స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా- 56 వేల మార్క్ కోల్పోయిన సెన్సెక్స్
Stock Market today: స్టాక్ మార్కెట్లపై మరోసారి బేర్ పంజా విసిరింది. దీనితో సెన్సెక్స్ ఒక్క రోజులోనే 1,190 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 371 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లు వారాంలో తొలిరోజు (సోమవారం) భారీ నష్టాలతో (Stocks Closing bell) ముగిశాయి. సూచీలు నష్టాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 1,190 పాయింట్లు తగ్గి 55,822 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 371 పాయింట్ల నష్టంతో 16,985 వద్ద స్థిరపడింది.
భారీ నష్టాలకు కారణాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటేకే ఆందోళనకర స్థాయికి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసులు 160పైకి చేరాయి.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాల (Omicron scare) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనితో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు ఇతర దేశాల మార్కెట్లు కూడా భారీగా పతనమవడం వల్ల.. దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా రికార్డు స్థాయిలో సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
నేటి సెషన్లో దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. లోహ, ఆర్థిక షేర్లు భారీగా కుదేలయ్యాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 56,538 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 55,132 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 16,840 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,410 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 2 కంపెనీలు మాత్రమే స్వల్పంగా లాభాలను నమోదు చేశాయి. మిగతా 28 కంపెనీలు డీలా పడ్డాయి.
హెచ్‌యూఎల్ 1.64 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.02 శాతం లాభాలను నమోదు చేశాయి.
టాటా స్టీల్ 5.21 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.93 శాతం, బజాజ్ ఫినాన్స్ 3.90 శాతం, ఎస్బీఐ 3.62 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.22 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్) హాంకాంగ్, సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు సైతం భారీ నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 18 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.90 వద్ద కొనసాగుతోంది.
Also read: Royal Enfield recall: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లలో లోపం- 26 వేల యూనిట్లు రీకాల్!
Also read: IPPB Alert: ఖాతాదారులకు ఐపీపీబీ షాక్- వచ్చే ఏడాది నుంచి ఛార్జీల బాదుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook