Stock Markets: స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల వారాంతంలో తేరుకున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు సద్దుమనుగుతున్నట్లు వార్తలు వస్తుండటం, ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలోని అంశాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 412 పాయింట్లు పెరిగింది. దీనితో 59,447 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 145 పాయింట్లు లాభంతో 17,784 వద్దకు పెరిగింది.


ఎఫ్​ఎంసీజీ, డాక్టర్​ రెడ్డీస్​, బ్యాంకింగ్ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఐటీ, హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లు మాత్రం నష్టాలను కొనసాగించాయి.


సూచీల కదలికలు ఇలా..


ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,504 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది.   58,977 కనిష్ఠానికీ పడిపోయింది.


నిఫ్టీ అత్యధికంగా 17,787 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 17,623 స్థాయిని కూడా చేరింది.


నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..


ఐటీసీ 4.36 శాతం, ఎం&ఎం 2.70 శాతం, డాక్టర్​ రెడ్డీస్​ 2.67 శాతం, టైటాన్​ 2.26 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్​ 1.75 శాతం లాభాలను గడించాయి.


టెక్​ మహీంద్రా 1.18 శాతం, మారుతీ సుజుకీ 1.04 శాతం, ఎన్​టీపీసీ 0.98 శాతం, టెక్ మహీంద్రా 0.65 శాతం, సన్​ఫార్మా 0.36 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.


Also read: Google Play Store: ప్లేస్టోర్‌లో అప్‌డేట్ ఇవ్వని యాప్‌లకు గూగుల్ షాక్‌...!


Also read: Cardless withdrawal: కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా: ఆర్​బీఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook