Stock Market today: స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డు సృష్టించాయి. గత సెషన్​(సోమవారం)లో నమోదైన నష్టాలన్నీ.. నేటి సెషన్​లో దాదాపుగా రికవరీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1736 పాయింట్లు బలపడి 58,142 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 510 పాయింట్లు లాభాంతో 17,352 వద్ద స్థిరపడింది.


నిన్న భారీ నష్టాలకు కారణమైన రష్యా-ఉక్రెయిన్ అంశంలో సానుకూలతలు పెరుగుతుంటడం మార్కెట్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరు దేశాలు చర్చల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్లు వస్తున్న వార్తలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయని విశ్లేషకులు చెబుతున్నారు.


దీనికి తోడు అన్ని రంగాలు నేడు సానుకూలంగా స్పందించడం కూడా లాభాలకు కారణైనట్లు తెలుస్తోంది.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో సెన్సెక్స్ 58,211 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. కనిష్ఠంగా 56,438 స్థాయికి పడిపోయింది.


నిఫ్టీ కూడా 17,185 అత్యధిక స్థాయిని తాకగా.. ఓ దశలో 16,839 వద్దకు చేరింది.


నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..


30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.


బజాజ్ ఫినాన్స్ 5.38 శాతం, బజాజ్ ఫిన్​సర్వ్​ 4.46 శాతం, విప్రో 4.26 శాతం, ఎస్​బీఐ 4.26 శాతం, ఎల్​ & టీ 4.11 శాతం లాభాలను గడించాయి.


Also read: LIC Jeevan Labh Policy: రూ.262 పెట్టుబడితో రూ.20 లక్షల వరకు లాభం పొందండి!


Also read: Anoushka Jolly: ఒక్క యాప్‌ ఐడియాతో రూ. 50 లక్షల ఫండింగ్ పట్టేసిన విద్యార్థిని!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe