Stocks to Buy: 60 శాతం లాభాలు తెచ్చిపెట్టే షేర్స్ ఇదిగో
Stocks to Buy Today For High Returns: ఈక్విటి షేర్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఏ షేర్పైకి లేస్తుందో.. ఏ షేర్ కొంప ముంచుతుందో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. అయితే, అలా సొంతంగా తెలివైన నిర్ణయం తీసుకోలేని వారి కోసమే షేర్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఇన్వెస్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటీ ఫర్మ్స్ చాలానే ఉంటాయి.
Stocks to Buy Today For High Returns: షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి సలహాలు, సూచనలు ఇచ్చే ఈక్విటి కన్సల్టంట్ ఫర్మ్‌లో ఒకటైన కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ తాజాగా ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వ్యాపారం చేస్తోన్న 6 ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 60 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఆ కంపెనీల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
ఎల్ఐసి షేర్ ప్రైస్ టార్గెట్ :
ఎల్ఐసి షేర్ ప్రస్తుతం రూ.603 వద్ద ఉండగా.. ఈ కంపెనీ షేర్స్ రూ. 975 మార్క్ తాకే అవకాశం ఉందని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ బయ్ రేటింగ్ ఇచ్చింది. ఒక్కో షేర్ పై రూ. 371 వరకు రిటర్న్స్ లభించే అవకాశం ఉంది. దాదాపు 60 శాతం లాభాలు వెనకేసుకోవచ్చని ఎల్ఐసి అంచనా వేస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్ ప్రైస్ టార్గెట్:
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ మార్చి 8న మార్కెట్ ముగిసే సమయానికి రూ. 495 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ షేర్ రూ. 660 వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ఈ షేర్ ని ఇప్పుడు కొనుగోలు చేస్తే.. కాస్త అటు ఇటుగా 33 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందన్నమాట.
ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ లైఫ్ షేర్ ప్రైస్ టార్గెట్ :
ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ లైఫ్ షేర్ ప్రస్తుతం రూ.407 వద్ద ఉండగా.. ఇది రూ. 575 వరకు రీచ్ అవుతుందని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ అంచనా వేస్తూ బయ్ రేటింగ్ ఇచ్చింది. అంటే ఒక్క షేర్ పై రూ. 168 వరకు లాభం ఉండే అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడి పెడితే 41 శాతం లాభాలు వచ్చే అవకాశం ఉందని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ అంచనా వేస్తోంది.
మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ షేర్ ప్రైస్ టార్గెట్ :
మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ షేర్ ప్రస్తుతం రూ.687 వద్ద ఉంది. అయితే, ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ రాబోయే రోజుల్లో రూ. 925 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్కో షేర్ పై రూ. 247 వరకు లాభం ఆర్జించే అవకాశం ఉంది. మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ షేర్ కొనుగోలు చేసిన వారికి దాదాపు 35 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ అభిప్రాయపడింది.
పిబి ఫింటెక్ షేర్ ప్రైస్ టార్గెట్:
పిబి ఫింటెక్ మార్చి 8న మార్కెట్ ముగిసే సమయానికి రూ.571 వద్ద ట్రేడ్ అవుతోంది. కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ అంచనాల ప్రకారం పాలసి బజార్ ఫింటెక్ షేర్ ధర రూ. 700 మార్క్ తాకే అవకాశం ఉంది. అంటే ఈ షేర్‌ని కొనుగోలు చేసిన వారికి ఒక్కో షేర్ పై రూ. 129 వరకు రిటర్న్స్ లభించే అవకాశం ఉంది.
ఎస్బీఐ లైఫ్ షేర్ ప్రైస్ టార్గెట్ :
ఎల్ఐసి షేర్ ప్రస్తుతం రూ.1130 వద్ద ఉంది. ఈ కంపెనీ షేర్స్ రూ.1450 టార్గెట్ ప్రైస్ గా నిర్ణయిస్తూ కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ సంస్థ బయ్ రేటింగ్ ఇచ్చింది. ఒక్కో షేర్ పై రూ. 320 వరకు రిటర్న్స్ లభించే అవకాశం ఉంది. దాదాపు 28 శాతం లాభాలు తీసుకోవచ్చని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ల ప్రైస్ టార్గెట్‌పై కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటిస్ అంచనా వేస్తోంది. షేర్ మార్కెట్‌కి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.
ఇది కూడా చదవండి : Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై రూ. 16 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్
ఇది కూడా చదవండి : Hyundai Alcazar 2023: హ్యూందాయ్ నుంచి సూపర్ పవర్‌ఫుల్ కారు వచ్చేసింది
ఇది కూడా చదవండి : HDFC Bank: అమ్మకానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్స్ డేటా ? స్పందించిన బ్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo