Sukanya Samriddhi Yojana : కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఈ పథకానికి ఎంతో ప్రజాదరణ లభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మారిన నిబంధనలేంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015లో కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డల భవిష్యత్తుకోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. బేటీ బచావో..బేటీ పడావో లో భాగంగా ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆడబిడ్డల పై చదువులు, వివాహానికి అయ్యే ఖర్చులను తీర్చాలన్న ఉద్దేశ్యంతో వారి తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టేవిధంగా ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. పోస్టాఫీస్ స్కీముల్లో అన్నింటికంటే ఎక్కువ వడ్డీ రేటు ఇందులో అందిస్తుంది. ఇందులో 8.20శాతం వడ్డీ రేటు ఉంది. 10ఏండ్ల వయస్సు లోపు ఆడపిల్లల పేరు మీద ఖాతా తెరవాలి. వరుసగా 15ఏండ్లు ఏటా కనిష్టంగా రూ250 నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పన్ను విధింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. 


కేంద్రం మార్చిన రూల్స్ ఇవే : 


ఎన్పీఎస్ కింద సుకన్య సమృద్ధి యోజనతోపాటు పీపీఎఫ్ వంటి ఇతర ఖాతాలను క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఖాతా తెరిచినప్పుడు వ్యత్యాసాలను సరిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైన అప్ డేట్స్ లో ఒకటి గ్రాండ్ పేరెంట్స్ తెరచిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు సంబంధించింది. 


Also Read : Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి  అలర్ట్..ఆర్బిఐ కొత్త గైడ్‎లెన్స్ ఇవే  


గతంలో ఆడపిల్లల అమ్మమ్మలు, నానామ్మలు, తాతలు కూడా సంరక్షకులుగా ఉండకున్నా వారి ఆర్థిక భద్రత కోసం ఈవిధంగా ఖాతాలను తెరిచేవారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కాలేరు. సంరక్షకులు లేదా పిల్లల పేరెంట్స్ తెరవని సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం తప్పనిసరిగా సంరక్షక బదిలీ చేయాల్సిందే. లేదంటే గ్రాండ్ పేరెంట్స్ వంటి వారి పేరుతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను క్లోజ్ చేసే ఛాన్స్ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ లేని బాలికలు వారి గ్రాండ్ పేరెంట్స్ సంరక్షకులుగా ఉండాలనుకుంటే ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read : Currency Notes:  కస్టమర్లకు ఊరట..చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.