Suzuki Swift: సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఈ ఏడాది జపాన్ మార్కెట్‌లో 5వ జనరేషన్‌లో అడుగెట్టనుంది. సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ గ్లోబల్ ప్రీమియర్ 2023 చివర్లో ఉండవచ్చని అంచనా. మంచి ఫీచర్లు, మైలేజ్, అనుకూలమైన ధరకు స్విఫ్ట్ పెట్టింది పేరుగా చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు మరి కొద్దినెలల్లో జపాన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకూ 4 తరాలు చూసిన స్విఫ్ట్ ఇప్పుడు 5వ జనరేషన్‌లో అడుగెట్టనుంది. స్విఫ్ట్ స్పోర్టివ్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ పేరుతో 2024 లో సరికొత్త మోడల్, లుక్‌లో లాంచ్ కానుంది. స్విఫ్ట్ నెక్స్ట్ జనరేన్ 2024 ఫిబ్రవరిలో ఉండవచ్చు. అయితే మారుతి సుజుకి కంపెనీకు స్విఫ్ట్ స్పోర్ట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదు. ఈ కారుకు సంబంధించి అతిపెద్ద అప్‌గ్రేడ్ పవర్ ట్రేన్‌లో ఉంటుంది. సరికొత్త ఆల్ న్యూ స్విఫ్ట్‌లో  టొయోటాకు చెందిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నిక్ ఉంటుంది. ఇక పవర్ ట్రెన్‌లో 1.2 లీటర్, 3 సిలెండర్ పెట్రోల్ ఎట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రెన్‌ను హై ట్రిమ్ లెవెల్స్  కోసం రిజర్వ్ చేస్తారు. స్విఫ్ట్ స్పోర్ట్ మైలేజ్ లీటర్‌కు 35 కిలోమీటర్లు ఉండవచ్చు. 


స్విఫ్ట్ వేరే మోడల్‌లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించవచ్చు. ఇది సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్‌తో పాటే వస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌లో ఇప్పుడున్న మోడల్‌లాగే 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. కొత్త స్విఫ్ట్ స్పోర్ట్‌లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నిక్‌తో పాటు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చని అంచనా ఉంది. స్విఫ్ట్ ఎక్స్‌టీరియర్ కూడా చాలా మారి కన్పిస్తుంది. ఇప్పడున్న జనరేషన్‌తో పోలిస్తే హ్యాచ్‌బ్యాక్ ఎక్కువ యాంగ్యులర్‌గా ఉండవచ్చు. ముందు భాగంలో కొత్త గ్రిల్ మోడల్, కొత్త ఎల్‌ఈడీ ఎలిమెంట్స్‌తో పాటు స్లీక్‌గా హెడ్ ల్యాంప్స్, ఫాక్స్ ఎయిర్ వెంట్, రివైజ్డ్ బంపర్‌తో పాటు అప్‌డేట్ అవుతుంది. సుజుకి స్విఫ్ట్‌లో కొత్త బాడీ ప్యానెల్, బ్లాక్ అవుట్ పిల్లర్ ఉంటుంది.


Also read: Bullet 750 Cc Price: త్వరలోనే మార్కెట్లోకి Royal Enfield 750 cc ఇంజన్ బైక్.. ఫీచర్లు, లాంచింగ్ డేట్ వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook