COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Swift Dzire New Model 2024: ఎప్పటినుంచో మంచి కార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి శుభవార్త తీసుకువచ్చింది. గతంలో విక్రయాల్లో దూసుకుపోయిన మారుతి సుజుకి సెడెన్ డిజైర్ మరోసారి అప్డేట్ వేరియంట్‌లో విడుదల చెయ్యబోతోంది. దీనిని కంపెనీ అరో బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి స్విఫ్ట్ న్యూ మోడల్ విడుదల చేసిన తర్వాత మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ డిజైర్ కార్ విడుదలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది.


త్వరలోనే విడుదల కాబోయే షిఫ్ట్ డిజైర్ 2024 ప్రీమియం ఇంటీరియల్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది డీజిల్ ఇంజన్‌తో పాటు జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మారుతి సుజుకి డిజైర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.


మారుతి సుజుకి డిజైర్ 2024 ఇంటీరియర్ డిజైన్ వివరాల్లోకి వెళితే, ఈ కారులోని క్యాబిన్ ఇంతకు ముందున్న మోడల్స్ కంటే మరింత దృఢంగా రాబోతోంది. దీంతోపాటు తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇంస్ఫోటైన్మెంట్ సిస్టంని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్లైమేట్ కంట్రోల్ సిస్టంతో పాటు 360 డిగ్రీల కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రతి సుజుకి ఈ కారులో పెద్ద అప్డేట్‌ని తీసుకువచ్చింది. ఇందులో సింగిల్ పేన్ సన్రూఫ్ కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూస్తే, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ కారుకు సంబంధించిన ప్రధాన పార్ట్ అయినా పవర్ ట్రైయిన్ విషయానికొస్తే..మారుతి సుజుకి డిజైర్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది ఇది గరిష్టంగా 83 బిహెచ్పి శక్తిని, 108nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేయగలుగుతుంది. దీని ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ అనే టెక్నాలజీని వినియోగించి తయారుచేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ కారులో అనేక రకాల కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. కంపెనీ ఈ కారుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నట్లు మార్కెట్లో టాక్ నడుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి