Tata Group IPO: టాటా గ్రూప్ నుంచి 19 ఏళ్ల తరువాత ఐపీవో, ఎలా ఉంటుందంటే
Tata Group IPO: సుప్రసిద్ధ టాటా గ్రూప్ అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. టాటా కంపెనీల షేర్లు ఎప్పుడూ లాభాల బాట పట్టిస్తుంటాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత టాటా గ్రూప్ మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Tata Group IPO: టాటా గ్రూప్ అంటే దేశంలో అందరికీ సుపరిచితం. దేశంలో దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని చూరగొని అంతకంతకూ వ్యాపారాన్ని విస్తరిస్తున్న గ్రూప్ ఇది. టాటా గ్రూప్ నుంచి ఇప్పుడు మరో ఐపీవో వెలువడుతోంది. ఈ ఐపీవో ఎందుకు విశేషమంటే 19 ఏళ్ల తరువాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవో ఇది.
టాటా గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల ఐపీవోలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. అన్ని కంపెనీల షేర్లు..షేర్ హోల్డర్లకు లాభాలు కురిపిస్తూనే ఉంటాయి. మధ్యలో ఒడిదుడుకులున్నా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉండదు. అందుకే టాటా గ్రూప్ ఐపీవో అంటే ఓ నమ్మకం. ఇప్పుుడు ఏకంగా 19 ఏళ్ల తరువాత టాటా గ్రూప్‌కు చెందిన ఓ కంపెనీ ఐపీవో వెలువరిస్తోంది. టాటా గ్రూప్ నుంచి చివరి ఐపీవో 2004లో వచ్చింది. ఇది టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందింది. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఐపీవో వెలువడనుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ 4000 కోట్లను సమీకరించనుంది.
టాటా టెక్నాలజీస్ అనేది టాటా గ్రూప్ అనుబంధ సంస్థ. టాటా టెక్నాలజీస్ త్వరలో ప్రవేశపెట్టనున్న ఐపీవోకు సెబీ ఆమోదం లభించింది. త్వరలోనే మార్కెట్‌లో టాటా గ్రూప్‌కు చెందిన మరో ఐపీవో షేర్ మార్కెట్‌లో చేరనుంది. టాటా టెక్నాలజీస్‌తో పాటు మరో రెండు కంపెనీల ఐపీవోలను సెబీ ఆమోదించింది. ఈ జాబితాలో గాంధార్ ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ కాగా మరొకటి నాన్ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఎఫ్‌సి ఫైనాన్స్ మరొకటి.
టాటా టెక్నాలజీస్, ఎస్‌బీఎఫ్‌సి ఫైనాన్స్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు మూడూ డిసెంబర్ 2022-మార్చ్ 2023 మధ్య సెబీకు దరఖాస్తు చేసుకున్నాయి. జూన్ 21-23 న వీటికి ఆమోదం లభించింది. అందుతున్న ప్రాధమిక సమాచారం మేరకు టాటా టెక్నాలజీస్ ఐపీవో పూర్తిగా విక్రయరూపంలో ఉంది. కంపెనీ మొత్తం 9.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. టాటా టెక్నాలజీస్ సంస్థ దాదాపు 33 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఇదొక ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ వ్యాపారానికి సంబంధించింది. దీంతోపాటు ఆటోమేటివ్, ఇండస్ట్రియల్ హెవీ మెషీనరీ, ఏరోస్పేస్ సెక్టార్‌లకు కూడా సేవలందిస్తుంది. టాటా టెక్నాలజీస్‌కు మార్కెట్‌లో ఉన్న పోటీ కంపెనీలు Cyient, Infosys, KPIT Technologies, Persistentలు. టాటా గ్రూప్ నుంచి చివరి ఐపీవో టీసీఎస్ ఐపీవో 2004లో వెలువడింది. ఇప్పుడీ కంపెనీ ఐపీవో ద్వారా టాటా గ్రూప్ 4000 కోట్లను సమీకరించనుంది.
గాంధార్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలో 357 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లు విక్రయానికి ఉంటాయి. కంపెనీ ప్రొమోటర్లు, షేర్ హోల్డర్లు 1.2 కోట్ల షేర్లు విక్రయిస్తారు. కంపెనీ ఈ షేర్ల విక్రయం ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించవచ్చు. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ ఎస్‌బీఎఫ్‌సి ఫైనాన్స్ ఐపీవో ద్వారా 1200 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఇందులో 750 కోట్ల రూపాయలు కొత్త ఆఫర్ ద్వారా, 450 కోట్ల రూపాయలు ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook