Tata Group: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మీ కోసం మరో మంచి ప్రత్యామ్నాయం కన్పించనుంది. త్వరలో టాటా గ్రూప్‌కు చెందిన ఓ కంపెనీ ఐపీవో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతి పెద్ద పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఇప్పుడు షేర్ మార్కెట్‌లో వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా ప్లే ఐపీవో త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఐపీవో కోసం ఈ నెలాఖరునాటికి సెబీకు డ్రాఫ్ట్ సమర్పించవచ్చు.


ఐపీవో పరిమాణం ఎంత ఉంటుంది


వివిధ మార్కెట్ వర్గాల్నించి వస్తున్న సమాచారం మేరకు ఈ నెలలో అంటే సెప్టెంబర్ వరకూ డైరెక్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్ఠ్స్ డ్రాఫ్ట్ సెబీకు చేరవచ్చు. ఇక ఐపీవో పరిమాణం 300-400 మిలియన్ డాలర్లు ఉండవచ్చని సమాచారం.


టాటా ప్లే ఐపీవో గురించి ఇంతకుముందే చర్చ సాగింది. జూలై నెలలో కూడా ఇలాంటి వార్త వెలువడింది. టాటా ప్లేగా మారిన టాటా స్కైలో చాలా కంపెనీలకు భాగస్వామ్యముంది. టాటా గ్రూప్ ఈ కంపెనీని 2004లో నెట్‌వర్క్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్‌జెడ్ కంపెనీతో కలిపి టాటా స్కై కంపెనీ ప్రారంభించింది. ఇది కాకుండా డిస్నీ కూడా ఇందులో వాటా కలిగి ఉంది. కంపెనీలోని భాగస్వాములు కొంతవాటాను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. ఐపీవో టాటా గ్రూప్ ద్వారా జారీ కానుంది. కంపెనీ నెట్ లాభాలు దాదాపుగా 68 కోట్లవరకూ ఉన్నాయి.


ఈ ఏడాది ఎల్ఐసీ వంటి కొన్ని కంపెనీలు ఐపీవో విడుదల చేశాయి. ఎల్ఐసీ ఐపీవోతో ఇన్వెస్టర్లకు ఊహించని నిరాశ ఎదురైంది. ఎల్ఐసీ షేర్ ఇప్పుడు 826 నుంచి 664 రూపాయలకు పడిపోయింది. ఇక డెలివరీ కంపెనీ షేర్ మే 27వ తేదీన 541 రూపాయలుండగా..సెప్టెంబర్ 3 నాటికి 563 రూపాయలైంది. ఈ ఏడాది విడుదలైన రెండు కంపెనీల్లో మిశ్రమ ఫలితాలు కన్పించాయి. టాటా గ్రూప్ కంపెనీలు మంచి లాభాల్ని ఆర్జిస్తుండటంతో..టాటా ప్లే ఐపీవో ఇన్వెస్టర్లను నిరాశపర్చదని అంచనా.


Also read: Multibagger Stocks: లక్ష రూపాయలను 28 కోట్లు చేసిన స్టాక్ ఇది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook