Tata Motors Festive Offers: కొత్త కారు కొనేవారికి గుడ్‌న్యూస్ టాటా కార్లపై భారీగా 3 లక్షల వరకు డిస్కౌంట్
Tata Motors Festive Offers: టాటా మోటార్స్ కార్లు ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. దాదాపు అన్ని మోడల్ కార్లకు ఈవీ వెర్షన్ దించింది కంపెనీ. అంతటితో ఆగకుండా ఇప్పుడు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tata Motors Festive Offers: భారతీయ కారు మార్కెట్‌లో పాతుకుపోయేందుకు టాటా మోటార్స్ సరికొత్త ఫెస్టివల్ ఆఫర్లు అందిస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన అన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో హల్‌చల్ చేస్తోంది. ఈసారి ఏకంగా 3 లక్షల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. టాటా టియాగో, టాటా పంచ్. టాటా నెక్సాన్, టాటా సఫారీ ఇలా అన్ని కార్లపై ఊహించని ఫెస్టివ్ ఆఫర్లు ఉన్నాయి.
వచ్చే అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. మీరు కూడా పండుగ వేళ కొత్త కారు కొనే ఆలోచన చేస్తుంటే ఇదే మంచి అవకాశం. టాటా మోటార్స్ తన కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కారు మోడల్‌ను బట్టి 3 లక్షల రూపాయల వరకు డిస్కొంట్ ప్రకటించింది. టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల ధరల్ని కూడా గణనీయంగా తగ్గించింది. మార్కెట్‌లో సత్తా చాటేందుకు ధర విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫెస్టివల్ డిస్కౌంట్స్ అందిస్తోంది. టాటా టియాగోపై 40 వేలు, టాటా పంచ్ కారుపై 1.2 లక్షలు, టాటా నెక్సాన్‌పై ఏకంగా 3 లక్షలు తగ్గించింది.
రానున్న పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలపై 2 లక్షల వరకూ తగ్గింపు ఉండవచ్చు. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్, క్యాష్ పేమెంట్ డిస్కౌంట్ ఉండనే ఉన్నాయి. ఈసారి పండుగ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చేందుకు టాటా మోటార్స్ ఆఫర్లు దోహదం చేయనున్నాయి. ఈ ఫెస్టివ్ ఆఫర్ అక్టోబర్ 31 వరకే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అక్టోబర్ 31 తరువాత కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తించదు. ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా తగ్గింపు ఉంది.
డిస్కౌంట్ తరువాత టాటా కార్ల ప్రారంభ ధరలు ఇలా
Tata Motors Cars prices after Discount
టాటా టియాగో 4.99 లక్షలు
టాటా ఆల్ట్రోస్ 6.49 లక్షలు
టాటా నెక్సాన్ 7.99 లక్షలు
టాటా హ్యారియర్ 14.99 లక్షలు
టాటా సఫారీ 15.49 లక్షలు
రానున్న పండుగల్ని దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ సంస్థ ఫెస్టివ్ ఆఫ్ కార్స్ కార్యక్రమంలో భాగంగా వివిధ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై, ఆగస్టు నుంచి దాదాపు అన్ని కంపెనీల కార్ల విక్రయాల్లో క్షీణత కన్పిస్తోంది. కార్ల విక్రయాలు 4.5 శాతం నుంచి 8.5 శాతం, 12.7 శాతం కూడా తగ్గిన పరిస్థితి ఉంది. అందుకే వివిధ కంపెనీలు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నాయి.
Also read: MG Windsor EV launch: ఫ్లైట్ ఫీచర్లతో మతి పోగొడుతున్న MG Windsor EV ధర ఇతర ఫీచర్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.