Tata Motors: ప్రతి నెలా అన్నింటికంటే ఎక్కువగా విక్రయమయ్యే ఎస్‌యూవీ జాబితాలో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా ఉన్నాయి. అయితే కేవలం 6 లక్షల రూపాయల్లో ఓ ఎస్‌యూవీ బ్రెజా, నెక్సాన్ కార్లకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవలే ఈ కారు అమ్మకాలు రికార్డు సృష్టించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్‌యూవీ కార్లంటే చాలామందికి క్రేజ్ ఎక్కువ. ఎస్‌యూవీ అనగానే ఎక్కువగా మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ కార్లే గుర్తుకొస్తుంటాయి. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరకే లభ్యమౌతున్న ఈ ఎస్‌యూవీ మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌లను వెనక్కి నెట్టేసింది. ఆ కారు టాటా పంచ్. ఇటీవల టాటా పంచ్ 1.75 లక్షల యూనిట్లు విక్రయాలు నమోదు చేసింది. చాలాకాలం నుంచి టాటా పంచ్ అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీల్లో రెండవ స్థానంలో ఉంది. ప్రతినెలా టాప్ 10 కార్ల జాబితాలో తప్పకుండా ఉంటోంది. ఫిబ్రవరిలో ఈ కారు 11,169 యూనిట్ల అమ్మకాలు జరిపింది. 


టాటా పంచ్ ధర, వేరియంట్


టాటా పంచ్ అనేది ఒక మైక్రో ఎస్‌యూవీ. దీని ధర 6 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 9.47 లక్షల వరకూ ఉంది. ఇందులో నాలుగు మోడల్స్ ఉన్నాయి. అవి ప్యూర్, అడ్వెంచర్, ఎక్కంప్లిష్డ్, క్రియేటివ్. ఇందులో గరిష్టంగా 5 మంది కూర్చోవచ్చు. ఈ మైక్రో ఎస్‌యూవీలో 366 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 187 ఎంఎం. 


టాటా పంచ్ ఇంజన్


టాటాట పంచ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 86 పీఎస్, 113 ఎన్ఎంతో ఉంటుంది. ఇది 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీతో వస్తుంది. త్వరలోనే టాటా పంచ్ సీఎన్జీ వెర్షన్ రానుంది. సీఎన్జీ వేరియంట్‌లో 77 పీఎస్, 97 ఎన్ఎం జనరేట్ అవుతుంది. 


టాటా పంచ్ ఫీచర్లు


ఈ ఎస్‌యూవీలో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్, ఆటో ఎయిర్ కండీషనింగ్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ సెన్సార్, రేర్ వ్యూ కెమేరా, ఐసోఫిక్స్ యాంకర్ ఉన్నాయి. టాటా పంచ్‌ను మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మ్యాగ్నైట్, రీనాల్ట్ కైగర్‌తో పోల్చవచ్చు.


Also read: Umrah Bus Accident: ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook